చిరు మూవీ కోసం మహేశ్ పారితోషికం ఎంతంటే...!
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సుమారు 40 శాతం షూటింగ్ కూడా ముగిసింది. అయితే ఈ సినిమాలో యంగ్ మెగాస్టార్‌గా అంటే ఫ్లాష్ బ్యాక్‌లో మొదట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఆ తర్వాత బన్నీ నటిస్తున్నారని వార్తలు వచ్చినప్పటికీ అవన్నీ పుకార్లే అని తేలిపోయాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబు ఆ పాత్రలో నటిస్తున్నారని గట్టిగానే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయని.. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఒప్పందం కుదర్చుకుని అధికారిక ప్రకటన ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ క్రమంలో మహేశ్ పాత్ర ఎలా ఉంటుంది..? మెగాస్టార్, సూపర్‌స్టార్ కలిసి నటిస్తే పరిస్థితి ఏంటి..? నిజంగానే ఆయన నటిస్తున్నారా..? అనేది ఇప్పుడు ఇటు సోషల్ మీడియాలో అటు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది.
అయితే తాజాగా.. ఇందుకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వెలుగు చూసింది. 30 నిమిషాల నిడివి కలిగిన పాత్రలో మహేశ్ నటించనున్నాడని సమాచారం. అరగంటకు గాను 30 కోట్ల రూపాయిలు ఇచ్చుకోవాలని దర్శకనిర్మాతలకు మహేశ్ తేల్చిచెప్పేశారట. అంతేకాదు లాభాల్లో వాటా కూడా అడిగారట. వాస్తవానికి ఇలాంటి పాత్రల్లో నటించడానికి మహేశ్ ఆసక్తి చూపడు అయితే.. మెగాస్టార్ సరసన కాబట్టి నోటి మాటెత్తకుండా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. అంతేకాదు.. మహేశ్ కోసం ప్రత్యేకంగా హీరోయిన్ కూడా సెట్ చేసేశారట. ఆ బ్యూటీ మరెవరో కాదు.. పొడుగుకాళ్ల సుందరి పూజా హెగ్దేనట.
మహేశ్ పాత్ర, రెమ్యునరేషన్, హీరోయిన్ గురించి వస్తున్న వార్తలను చూసిన నెటిజన్లు.. ‘వామ్మో సూపర్ స్టార్ సరిలేరు మీకెవ్వరు’ అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ కాంబో కోసం ఎన్నో రోజులుగా వేచి చూస్తున్నామని అభిమానులు చెబుతున్నారు. మరి ఇందులో నిజానిజాలెంత..? ఇవన్నీ పుకార్లుగానే మిగిలిపోతాయా..? లేదా అక్షరాలా నిజమవుతాయా అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com