మహేష్ రిలీజ్ చేసిన 'హీరో' టీజర్.. కౌబాయ్, జోకర్ గెటప్పుల్లో అశోక్ గల్లా
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ కృష్ణ మనవడిగా, మహేష్ మేనల్లుడిగా అశోక్ గల్లా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడైన అశోక్ గల్లా నటిస్తున్న తొలి చిత్రం 'హీరో'. కొద్దీ సేపటి క్రితమే సూపర్ స్టార్ మహేష్ చేతుల మీదుగా 'హీరో' టైటిల్ టీజర్ విడుదలైంది.
హీరో టీజర్ ఆసక్తికరంగా ఉంది. నిమిషం నిడివి ఉన్న టీజర్ లో అశోక్ గల్లా కౌబాయ్, జోకర్ గెటప్పుల్లో కనిపిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాడు. కౌబాయ్ చిత్రాలు అనగానే కృష్ణ నటించిన మోసగాళ్లకు మోసగాడు, మహేష్ టక్కరి దొంగ గుర్తుకు వస్తాయి. హీరో మూవీలో కౌబాయ్ పాత్రలో అశోక్ గల్లా మరింత రఫ్ లుక్ లో కనిపిస్తున్నాడు.
ముఖ్యంగా ఎడారిలో ప్రయాణిస్తున్న ట్రైన్ పై అశోక్ వాకింగ్ స్టైల్ ఆకట్టుకుంటోంది. అలాగే జోకర్ గెటప్ లో కూడా అశోక్ ఆకట్టుకుంటున్నాడు. భయంకరమైన నవ్వుతో సినిమాలో అశోక్ పాత్ర ఏంటి అనే ఉత్కంఠ ఎక్కువవుతోంది.
ఈ చిత్రంలో ట్రైన్ ఎపిసోడ్ కీలకం కానున్నట్లు తెలుస్తోంది. అశోక్ గల్లాకు జోడిగా హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తోంది. శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకుడు. సినిమా టోగ్రాఫర్ రిచర్డ్ ప్రసాద్ అందిస్తున్న విజువల్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. జిబ్రాన్ సంగీత దర్శకుడు. అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై పద్మావతి గల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో రిలీజ్ కు ముస్తాబవుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments