మహేశ్ విడుదల చేసిన 'దర్బార్' తెలుగు మోషన్ పోస్టర్
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ ఏఆర్‌మురుగదాస్‌ల ఫస్ట్ క్రేజి కాంబినేషన్లో రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం `దర్బార్`. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్‌తో, హైటెక్నికల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రజనీకాంత్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న సినిమాను అన్ని రకాల కమర్షియల్ హంగులతో మురుగదాస్ తెరకెక్కిస్తున్నారు. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన రజనీకాంత్ పోస్టర్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాను 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. తాజాగా దర్బార్ మూవీ తెలుగు మోషన్ పోస్టర్ని సూపర్ స్టార్ మహేష్ ఈరోజు సాయంత్రం గం.5 ని.30లకు విడుదల చేశారు.
ఈ సినిమా మోషన్ పోస్టర్లో రజనీకాంత్ కత్తితో విలన్స్ భరతం పట్టే స్టిల్‌ను విడుదల చేశారు. అనిరుధ్ అభిమానులను ఆకట్టుకునేలా పక్కా మాస్ బీట్‌ను ఈ మోషన్ పోస్టర్‌కు ఇచ్చారు.
``రజనీకాంత్ సార్ దర్బార్ మోషన్ పోస్టర్‌ను షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆయనపై నాకు ఎప్పటికీ ప్రేమ, గౌరవాలుంటాయి. మురుగదాస్ సహా ఎంటైర్ టీమ్‌కు అభినందనలు`` అని మెసేజ్‌ను కూడా మహేష్ పోస్ట్ చేశారు. రజనీకాంత్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నివేతా థామస్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తుంది, సునీల్ శెట్టి, తంబీ రామయ్య, యోగి బాబు, ప్రతీక్ బబ్బర్, నవాబ్ షా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.
Extremely happy to present the Telugu motion poster of @rajinikanth sir's #Darbar. Love & respect always! ?? Best wishes to @ARMurugadoss sir & the entire team???? #DarbarMotionPoster https://t.co/PgL9D27nBp
— Mahesh Babu (@urstrulyMahesh) November 7, 2019
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com