మహేష్ రికార్డ్ క్రాస్ చేయనున్న నాగ్
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ కింగ్ నాగార్జున సూపర్ స్టార్ మహేష్ రికార్డ్ క్రాస్ చేయడమా..? ఇంతకీ ఆ రికార్డ్ ఏమిటి అనుకుంటున్నారా..? యు.ఎస్ లో మహేష్ సినిమాలు శ్రీమంతుడు రెండో స్ధానంలో, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు ఐదవ స్ధానంలో,దూకుడు ఆరవ స్ధానంలో ఉన్నాయి. ఈ రికార్డ్స్ ఇలా ఉంటే... కింగ్ నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ ఊపిరి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఊపిరి చిత్రం రికార్డ్ స్ధాయి కలెక్షన్స్ వసూలు చేస్తుంది. ముఖ్యంగా నాలుగవ వారంలోనూ ఊపిరి మంచి కలెక్షన్స్ వసూలు చేస్తుండడం విశేషం.
యు.ఎస్ లో ఇటీవల ఊపిరి మనం రికార్డ్ ను క్రాస్ చేసి నాగార్జున కెరీర్ లో ఆల్ టైమ్ హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచి సరికొత్త రికార్డ్ సాధించింది. యు.ఎస్ లో ఇప్పటి వరకు ఊపిరి 1,559,065 డాలర్లు (10.37 కోట్లు ) వసూలు చేసింది. మహేష్ దూకుడు చిత్రం $1.56 డాలర్లు వసూలు చేసి ఆరవ స్ధానంలో ఉంది. త్వరలోనే మహేష్ దూకుడు కలెక్షన్స్ ను నాగ్ ఊపిరి క్రాస్ చేసి యు.ఎస్ లో టాప్ 5 లో స్ధానం దక్కించుకోబోతుండడం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments