ఆ విష‌యంలో మ‌హేశ్‌దే రికార్డు

  • IndiaGlitz, [Monday,April 23 2018]

భ‌ర‌త్ అనే నేను.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న లేటెస్ట్ సెన్సేష‌న‌ల్ మూవీ పేరిది. సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు క‌థానాయ‌కుడిగా స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ రూపొందించిన  ఈ సినిమా.. విడుద‌లైన అన్ని చోట్ల వ‌సూళ్ళ వ‌ర్షం కురిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ఓవ‌ర్సీస్‌లోనూ ఈ సినిమా క‌లెక్ష‌న్ల విష‌యంలో దూసుకుపోతోంది. తొలి రోజు (ప్రీమియ‌ర్స్‌తో క‌లుపుకుని) ఈ సినిమా $1.37 మిలియ‌న్ల గ్రాస్ క‌లెక్ట్ చేసింద‌ని ట్రేడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

మ‌హేశ్ సినిమాలు ఓవ‌ర్సీస్‌లో మిలియ‌న్ మార్క్ చేరుకోవ‌డం కొత్తేమీ కాదు. దూకుడు చిత్రంతో  తెలుగు సినిమాల ప‌రంగా మిలియ‌న్ క్ల‌బ్ ఓపెన్ చేసిన ఘ‌న‌త మ‌హేశ్‌దే. ఆ త‌రువాత వ‌చ్చిన బిజినెస్‌మేన్‌ను మిన‌హాయిస్తే.. సీతమ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, 1 నేనొక్క‌డినే, ఆగ‌డు, శ్రీ‌మంతుడు, బ్ర‌హ్మోత్స‌వం, స్పైడ‌ర్‌.. ఇప్పుడు భ‌ర‌త్ అనే నేను .. ఇలా వ‌రుస‌గా 7 చిత్రాల‌తో ద‌క్షిణాదిన ఏ హీరోకి సాధ్యం కాని అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు మ‌హేశ్‌.