తేజ కామెంట్స్ పై మహేష్ స్పందన..?
Send us your feedback to audioarticles@vaarta.com
మహేష్ శ్రీమంతుడు సినిమాలో పోషించిన పాత్రను రీల్ లైఫ్ లోనే కాదు...రియల్ లైఫ్ లో కూడా పోషించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో...గ్రామాల్ని దత్తత తీసుకున్నారు. మహేష్ తో పాటు శ్రుతి హాసన్, ప్రకాష్ రాజ్ కూడా ఊరును దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. అయితే హోరా హోరి సినిమా ప్రమోషన్ లో భాగంగా తేజ ఇచ్చిన ఇంటర్ వ్యూలో....సినిమాల ప్రభావం ప్రేక్షకుల పై ఉంటుందా...అని అడిగితే ...ప్రేక్షకుల పై సినిమా ప్రభావం అసలు ఉండదు అన్నారు.
అలా అయితే శ్రీమంతుడు సినిమా ప్రభావం వలనే అనుకుంట... మహేష్, శ్రుతి హాసన్, ప్రకాష్ రాజ్...గ్రామాల్ని దత్తత తీసుకున్నారు అంటే...మహేష్ ఊరును దత్తత తీసుకుంది. దేశాన్ని ఏదో ఉద్దరించేద్దామని కాదు. ఇన్ కమ్ టాక్స్ లో రాయితీ కోసమే. అయినా మహేష్ ఊరును దత్తత తీసుకోవాలనుకుంటే ఒక్కడు సినిమా రిలీజ్ అయిన్పడే దత్తత తీసుకుని ఉండే వాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. మహేష్ పై తేజ చేసిన వ్యాఖ్యలు సంచలన స్రుష్టించాయి. తేజ వ్యాఖ్యలపై మహేష్ ఓ ఆంగ్ల దిన పత్రికకి ఇచ్చిన ఇంటర్ వ్యూలో ఓ ప్రశ్నకు సమాధానంగా...తేజ చేసిన వ్యాఖ్యలును పట్టించుకోనని...అయినా... ఆయన ఏ ఉద్దేశ్యంతో అన్నారో తనకు తెలియదంటూ తేజ కామెంట్స్ ను లైట్ తీసుకున్నాడు మహేష్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com