మీ టూ వివాదంలో మ‌హేశ్‌, రానా మేనేజ‌ర్‌

  • IndiaGlitz, [Tuesday,October 16 2018]

ప్ర‌స్తుతం బాలీవుడ్‌తో పాటు ద‌క్షిణాదిన కూడా మీ టూ ఉద్యమం ఉధృతంగా సాగుతుంది. ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులైన మ‌హిళ‌లు తాము ఫేస్ స‌మస్య‌ల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలియ‌జేస్తున్నారు. చాలా మంది ఈ ఉద్యమానికి స‌పోర్ట్ చేస్తున్నారు. సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖ‌లు ఈ లిస్టులో చాలా మందే ఉన్నారు. ఇప్పుడు లైంగిక ఆరోప‌ణ‌ల లిస్టులో అనీర్ బేన్ దాస్‌బ్లాహ్ కూడా చేరారు.

అనీర్ ప్ర‌ముఖ మేనేజ్‌మెంట్ సంస్థ క్వాన్ కో ఫౌండ‌ర్‌. బాలీవుడ్‌లో రణ‌భీర్ క‌పూర్‌, దీపికా ప‌దుకొనెల‌కు అనీర్ మేనేజ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అంతే కాకుండా తెలుగు చిత్ర‌సీమ‌లో సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌, రానాకు అనీర్ మేనేజ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. అనీర్‌పై న‌లుగురు మ‌హిళ‌లు మీ టూలో కంప్లైంట్ చేశారు. ఇప్పుడు అనీర్ వ్య‌వ‌హారం ఎంత వ‌ర‌కు వెళుతుందో చూడాలి.