మహేశ్-పూరీ కాంబోలో సినిమా కష్టమేనా!?
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేశ్ బాబు, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇందుకు ‘పోకిరి’, ‘బిజినెస్‌మెన్’ లాంటి సినిమాలే నిదర్శనం. ‘పోకిరి’ ముందు వరకు ప్రిన్స్‌గా ఉన్న మహేశ్.. ఆ తర్వాత సూపర్‌స్టార్ రేంజ్ వచ్చేసింది. ఆ తర్వాత వచ్చిన ‘బిజినెస్‌మెన్’లో కూడా మహేశ్‌ను తనదైన స్టైయిల్‌లో చూపించాడు. ‘పోకిరి’ మూవీ రికార్డ్‌లు బ్రేక్ చేసి మహేశ్ కెరీర్‌లో ఇప్పటికీ ఆ రికార్డ్‌ను బ్రేక్ చేయలేకపోతున్నాడు. మరోవైపు ‘బిజినెస్‌మెన్’ తోనూ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ కాంబోలో హ్యాట్రిక్ సినిమా చేస్తే చూడాలని మహేశ్ అభిమానులు ఎన్నాళ్లనుంచో వేచి చూస్తు్న్నారు.
మాటా మంతిలో క్లారిటీ ఇచ్చిన మహేశ్
సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా.. ‘గీతగోవిందం’ డైరెక్టర్‌తో పరశురామ్‌తో తీయబోతున్న చిత్రం ‘సర్కార్ వారి పాట’ టైటిల్‌ను ప్రకటించాడు. అనంతరం అభిమానులు, నెటిజన్లతో ఇన్‌స్టాగ్రామ్‌లో మహేశ్ సరదాగా మాటామంతి జరిపాడు. ఈ సందర్భంగా పలువురు అభిమానులు అడిగిన ప్రశ్నలకు మహేశ్ సమాధానాలిచ్చాడు.
అభిమాని : రాబోయే రోజుల్లో పూరీతో కలిసి సినిమా చేస్తారా? మేం ఎదురుచూస్తున్నాం
మహేశ్ : ‘పూరీతో తప్పకుండా సినిమా చేసే అవకాశం ఉంది. నా అభిమాన దర్శకుల్లో ఆయన ఒకరు. పూరీ వచ్చి కథ చెబుతారేమోనని నేను ఇప్పటికీ ఎదురుచూస్తున్నాను’ అని మహేశ్ స్పష్టం చేశారు.
పూరీ ట్వీట్..
‘‘పరశురామ్.. చిన్నప్పటి నుంచి నీ ప్రయాణం చాలా దగ్గర నుంచి చూస్తున్నాను. ‘సర్కారు వారి పాట’ నీ ప్రయాణంలో మరో మైల్‌స్టోన్ చిత్రంగా నిలిచిపోతుంది. ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ లుక్ అలాగే టైటిల్ చాలా బాగున్నాయి. మహేష్ బాబు ఫ్యాన్స్ సంబరాలకు సిద్ధం అవ్వండి. చిత్రయూనిట్ మొత్తానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను..’ అని పూరి చెప్పుకొచ్చారు. ఇందుకు స్పందించిన పరశురామ్.. ‘థ్యాంక్యూ అన్నయ్యా.. నీ సపోర్ట్‌తోనే ఇదంతా సాధ్యమైంది. ఈ రోజు ఇక్కడున్నానంటే అందుకు కారణం నీవే. కృతజ్ఞతలు..’ అని తెలిపారు.
దీనికి స్పందన లేదేం..!
కాగా.. మహేశ్, పూరీ కలిసి ‘జనగణమన’ చేయాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల అది జరగలేదు. సో.. తాజాగా ‘సర్కారు వారి పాట’ పై స్పందించిన పూరీ.. మహేశ్‌తో మూవీపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే పూరీ మనసులో మహేశ్‌తో సినిమా తీయాలని ఉందో లేదో అర్థం కావట్లేదు. ఇదిలా ఉంటే.. ఇదివరకే ఈ ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చిన విషయం తెలిసిందే.
I have closely seen your journey since childhood #SarkaruVaariPaata is another milestone in your journey now @ParasuramPetla
— PURIJAGAN (@purijagan) May 31, 2020
I wish this becomes a huge blockbuster
loved the 1st look and title too @urstrulyMahesh fans will surely have a celebration
all the best to entire team?? pic.twitter.com/4pCEK89hua
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments