రియల్ లొకేషన్స్‌కే మహేశ్ మొగ్గు.. !
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేశ్, పరుశురామ్ కాంబినేషన్లో రూపొందతున్న చిత్రం 'సర్కారు వారి పాటస. ఈ సినిమా షూటింగ్ రీసెంట్గా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అయితే పూర్తి స్థాయి షూటింగ్ జనవరిలోనే ప్రారంభం కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా.. కోవిడ్ ప్రభావంతో ముందుగా ప్లాన్ చేసిన యుఎస్ షెడ్యూల్ వెనక్కి వెళ్లింది. ఇండియాలోనే చిత్రీకరణ చేస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం స్పెషల్ బ్యాంక్ సెట్ వేస్తారని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే అందులో నిజం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. చెన్నై, హైదరాబాద్, బెంగుళూరులో రియల్ లొకేషన్స్‌లోనే చిత్రీకరించాలని పరుశురామ్ భావించాడట. అందుకు మహేశ్ కూడా ఓకే అన్నట్లు టాక్. మార్చి వరకు ఇండియాలో చిత్రీకరించి ఏప్రిల్‌లో యుఎస్‌కు వెళ్లాలనేది ప్రస్తుతం ఉన్న ఐడియా అని తెలుస్తోంది.
కీర్తిసురేశ్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో మహేశ్ ఎన్నారై బిజినెస్ మేన్‌గా, ఫైనాన్సియర్‌గా.. ఇలా రెండు షేడ్స్‌లో కనిపిస్తారని సమాచారం. మహేశ్ 27వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ నిర్మిస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com