మెగా హీరోకి మహేష్ ప్రశంస

  • IndiaGlitz, [Wednesday,September 02 2015]

మెగాబ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం కంచె'. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. 1940, వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది. ఈ ట్రైలర్ కి మెగాభిమానులు, ప్రేక్షకుల నుండే కాకుండా ఇండస్ట్రీ వర్గాల నుండి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది.

ఈ ట్రైలర్ ను చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు ట్రైలర్ చాలా బావుందని కంచె టీమ్ ను అభినందిస్తూ ట్విట్టర్ మెసేజ్ పోస్ట్ చేయడం చూస్తుంటే ట్రైలర్ ఎంత బావుందో అర్థం అవుతుంది. మహేష్ తో పాటు, స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్, బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్, లక్ష్మీ మంచు, అల్లరి నరేష్, రామ్ గోపాల్ వర్మ, రకుల్ ప్రీత్ సింగ్, గోపిచంద్ మలినేని సహా పులువురు సినీ ప్రముఖులు ట్రైలర్ చాలా బావుందని ప్రశంసించారు. ఈ ప్రశంసలు జడివాని యూనిట్ కి కొత్త ఉత్సాహాన్నిస్తుందనడంలో సందేహం లేదు.

More News

రామ్ చరణ్ 'బ్రూస్ లీ' టీజర్ రివ్యూ...

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా డి.వి.వి.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘బూస్ లీ’. ది ఫైటర్ ఉపశీర్షిక.

దత్తత తీసుకోవాలనుకుంటున్న హీరోయిన్...

దక్షిణాది సినిమాలతో పాటు ఉత్తరాది సినిమాల్లో కూడా బిజీ హీరోయిన్ గా వరుస ప్రాజెక్ట్స్ తో ముందుకెళ్తున్న హీరోయిన్ శృతిహాసన్.

హ్యపీ బర్త్ డే టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.....

''నాక్కొంచెం తిక్కుంది.. కానీ దానికో లెక్కుంది''..

'సర్ధార్ గబ్బర్ సింగ్' టీజర్ రివ్యూ...

ఇటు యూత్, అటు ఫ్యామిలీ ఆడియెన్స్, పిల్లలు, పెద్దలు ఎవరికైనా అతని స్టయిల్ అంటే ఇష్టం...అతనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నేను ట్రెండ్ ఫాలోకాను.. ట్రెండ్ సెట్ చేస్తా..

మళ్లీ ఫిక్సయింది...

అనుష్క టైటిల్ పాత్రలో గుణా టీమ్ వర్క్స్ బ్యానర్పై గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రుద్రమదేవి’. ఇండియాస్ ఫస్ట్ హిస్టారికల్ త్రీడీ మూవీగా తెరకెక్కిన