క్లాసిక్ మూవీ అంటూ ‘ఉప్పెన’కు మహేశ్ ప్రశంస
Send us your feedback to audioarticles@vaarta.com
ఉప్పెన టీమ్ సక్సెస్‌ను ఎంజాయ్ చేసే పనిలో ఉంది. ఒకవైపు ప్రేక్షకులే కాదు, సెలబ్రిటీలు సైతం సినిమాను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. డెబ్యూ డైరెక్టర్, డెబ్యూ హీరో హీరోయిన్లు చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద క్రియేట్ చేస్తోన్న సందడి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇటీవల నందమూరి బాలకృష్ణ సినిమా చూసి యూనిట్‌ను అభినందించిన సంగతి తెలిసిందే. కాగా... ఇప్పుడు మరో స్టార్ హీరో ఉప్పెన టీమ్‌ను ప్రశంసల వెల్లువలో ముంచెత్తాడు. ఆ స్టార్ ఎవరో కాదు.. సూపర్‌స్టార్ మహేశ్.
సోమవారం ఉప్పెన సినిమా చూసిన మహేశ్ సినిమాను అభినందిస్తూ ట్వీట్స్ పెట్టారు. ‘‘ఉప్పెన’ గురించి ఒక మాటలో చెప్పాలంటే క్లాసిక్ మూవీ. ఈ సినిమాను వెనుక ఉండి సపోర్ట్ చేసిన సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్‌కు అభినందనలు. మీ టీమ్‌ను చూసి గర్వపడుతున్నాను. బుచ్చిబాబు నువ్వొక అరుదైన కాలాతీతమైన సినిమాల్లో ఒక సినిమాను తెరకెక్కించావు. నిన్ను చూసి గర్వపడుతున్నాను. వైష్ణవ్‌తేజ్, కృతిశెట్టి వంటి కొత్త హీరో హీరోయిన్స్ తన అభినయంతో హృదయాలను దోచుకున్నారు. మీరు నిజమైన స్టార్స్ ’’ అని తెలిపారు మహేశ్. సూపర్‌స్టార్ ప్రశంసలతో టీమ్‌కు మరింత ఎనర్జీ వచ్చింది. టీమ్ మహేశ్ ధన్యవాదాలు తెలిపారు.
ఫిబ్రవరి 12న వైష్ణవ్‌తేజ్, కృతి శెట్టి జంటగా నటించిన చిత్రం ‘ఉప్పెన’ విడుదలై బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. యాబై కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సినిమా క్రాస్ చేసింది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై సినిమా రూపొందింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments