మ‌హేష్ మ‌న‌సు దోచుకున్న నాయిక‌..

  • IndiaGlitz, [Tuesday,December 01 2015]

సూప‌ర్ స్టార్ మ‌హేష్ కి ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే ఎంతో మందికి మ‌హేష్ ఫేవ‌రేట్ హీరో. మ‌రి..మ‌హేష్ ఫేవ‌రేట్ హీరోయిన్ ఎవ‌రు..? ఇదే విష‌యాన్నిమ‌హేష్ ని అడిగితే..శ్రీదేవి ఆల్ టైమ్ ఫేవ‌రేట్ హీరోయిన్. ఇక ఈ జ‌న‌రేష‌న్ లో అయితే దీపిక ప‌డుకునే అంటే ఇష్టం. పీకూ మూవీలో దీపిక ఏక్టింగ్ సూప‌ర్. అందం, అభిన‌యం ఈ రెండు ఉన్న అతికొద్ది మందిలో దీపిక ఒక‌రు అంటూ తెగ పొగిడేసాడు.

అలాగే దీపిక టాలీవుడ్ లో ఫేవ‌రేట్ హీరో అంటే మ‌హేష్ అని చాలా సార్లు చెప్ప‌డం విశేషం. మ‌హేష్..దీపిక‌..ఒక‌రంటే ఒక‌రికి ఇష్టం. మ‌రి క‌ల‌సి న‌టించ‌డానికి ఎందుకు ఆల‌స్యం..? ముంబైలో ప్రొడ‌క్ష‌న్ హౌస్ ప్రారంభించే ప్లాన్ లో ఉన్నాడు మ‌హేష్. సో..ప్యూచ‌ర్ లో ఖ‌చ్చితంగా మ‌హేష్‌, దీపిక క‌ల‌సి న‌టిస్తార‌ని ఆశిద్దాం.