'బాహుబలి' కి సూపర్ స్టార్ ప్రశంస
Send us your feedback to audioarticles@vaarta.com
విజువల్ వండర్ గా విడుదలైన టాలీవుడ్ పీరియాడిక్ మూవీ బాహుబలి`కి పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల నుండి ప్రశంసలు లభిస్తుంది. ఈ వరుసలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చేరాడు. స్విజ్జర్లాండ్ నుండి వచ్చి ఇక్కడ బాహుబలి మానియాని చూసి స్టన్ అయిపోయాను. ఒక తెలుగు సినిమా ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుందని తాను ఉహించలేదని, రాజమౌళి తెలుగు ఇండస్ట్రీలో ఉన్నందుకు గర్వపడుతున్నాను.
ఆర్కా మీడియా ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయని, కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతం. ప్రభాస్, రానా సినిమాలో చాలా టెరిఫిక్ గా ఉన్నారు. వారి హార్క్ వర్డ్ కి తగిన గుర్తింపు లభిస్తుందని మహేష్ తన సోషల్ మీడియా ద్వారా ప్రభాస్, రానా అండ్ టీమ్ ను అభినందించాడు. మహేష్ అందించిన ప్రశంసలకు థాంక్స్ అంటూ రానా తెలియజేశాడు. బాహుబలి కలెక్షన్స్ సునామీకి మహేష్ కూడా సపోర్ట్ చేశాడనే చెప్పాలి.
ఎందుకంటే శ్రీమంతుడు సినిమాని జూలై 17న విడుదల చేయాలని నిర్మాతలు భావించినా రెండు పెద్ద సినిమాలు వస్తే బాక్సాఫీస్ వద్ద ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉండటంతో మహేష్ ను రాజమౌళి అండ్ టీమ్ సంప్రదించగా, మహేష్ నిర్మాతలతో మాట్లాడి శ్రీమంతుడు చిత్రాన్ని ఆగస్ట్ 7న పోస్ట్ పోన్ చేశాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com