పుష్ప సినిమాను వీక్షించిన మహేశ్.. నీ నటన స్టన్నింగ్ అంటూ బన్నీకి కాంప్లిమెంట్
Send us your feedback to audioarticles@vaarta.com
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘పుష్ప’’ సినిమా విజయవంతంగా దూసుకెళ్తోంది. విడుదలైన అన్ని ప్రాంతాల్లో మంచి వసూళ్లు రాబడుతూ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. రిలీజై నాలుగు వారాలు గడుస్తున్నా థియేటర్లు ఇంకా హౌస్‌ఫుల్ బోర్డులతో రన్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పుష్పకు అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు కూడా దక్కుతున్నాయి. ఇప్పటికే ఈ మూవీ చూసిన నందమూరి బాలకృష్ణ బాగా చేశారంటూ అల్లు అర్జున్ సహా చిత్ర యూనిట్‌ను ప్రశంసించారు. ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి సూపర్‌స్టార్ మహేశ్ బాబు చేరారు. ‘‘పుష్ప’’ మూవీని చూసిన ఆయన బుధవారం ట్విట్టర్ ద్వారా బన్నీ అండ్ టీమ్‌ని అభినందించారు.
పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ నటన స్టన్నింగ్ అని కొనియాడిని ప్రిన్స్.. ఇది ఒరిజినల్ అని ట్వీట్ చేశాడు. తన సినిమాలు ఎంత వాస్తవంగా, నిజాయితీగా ఉంటాయనేది సుకుమార్ మరోసారి నిరూపించారని ప్రశసించారు మహేశ్. 'నీ గురించి ఏం చెప్పాలి? దేవి శ్రీ ప్రసాద్ నువ్వు రాక్ స్టార్ అంతే అని ట్వీట్లో పేర్కొన్నారు...' పుష్ప' సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ టీమ్ మొత్తానికి కంగ్రాట్స్. బాయ్స్.. చాలా గర్వంగా ఉంది' అని మహేశ్ అన్నారు.
ఇక.. పుష్పలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ విలన్‌గా నటించారు. అనసూయ, సునీల్, ధనుంజయ్, రావు రమేశ్ కీలకపాత్రలు పోషించారు. మైత్రి మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియాలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. మహేశ్ బాబు విషయానికి వస్తే ఆయన మోకాలు సర్జరీ చేయించుకుని దుబాయ్‌లో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘‘సర్కారు వారి పాట’’ మూవీలో నటిస్తున్నారు సూపర్‌స్టార్. మహేశ్ సరసన కిర్తీ సురేశ్ హీరోయిన్గా నటిస్తోంది.
.@alluarjun as Pushpa is stunning, original and sensational… a stellar act ?????? @aryasukku proves again that his cinema is raw, rustic and brutally honest... a class apart ????
— Mahesh Babu (@urstrulyMahesh) January 4, 2022
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments