కొడుకు కోరిక తీర్చిన మహేష్..

  • IndiaGlitz, [Tuesday,October 27 2015]

సూప‌ర్ స్టార్ మ‌హేష్‌..ప్ర‌స్తుతం బ్ర‌హ్మోత్సం సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ లో గ్యాప్ దొర‌క‌డంతో ఫ్యామిలీతో క‌ల‌సి ప్యారీస్ ప్లాన్ చేసారు. హాలీడేస్ లో...జాలీగా ప్యారీస్ ప్లాన్ చేయ‌డానికి ఓ కార‌ణం ఉంద‌ట‌. ఇంత‌కీ ఆ కార‌ణం ఏమిటంటే...మ‌హేష్ ని కొడుకు గౌత‌మ్ ఈఫిల్ ట‌వ‌ర్ చూపించ‌మ‌ని అడిగాడ‌ట‌. కుటుంబం అంటే ప్రాణమిచ్చే మహేష్...కొడుకు కోరిక కాదంటాడా...ఇంకేముంది ప్యారీస్ ప్లాన్ చేసాడు. కొడుకుకి ఈఫిల్ ట‌వ‌ర్ చూపించాడు. ఈఫిల్ ట‌వ‌ర్ చూపించ‌డ‌మే కాదు...ఈఫిల్ ట‌వ‌ర్ పైకి తీసుకెళ్లి చూపించి కొడుకు కోరిక తీర్చాడు మ‌హేష్. ఎన్నికోట్లు సంపాదించినా...కొడుకు కోరిక తీర్చ‌డంలో వ‌చ్చే ఆ సంతోష‌మే వేరు...అని చెప్ప‌క‌నే చెబుతున్న మ‌హేష్ నువ్వు సూప‌ర్..