రాజకీయాల గురించి మహేశ్ ఏమన్నాడంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ కృష్ణ తనయుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన మహేశ్ సూపర్‌స్టార్ రేంజ్‌కు చేరుకున్నాడు. ఆయనకంటూ ఓ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యింది. సూపర్‌స్టార్ కృష్ణను ఫాలో అవుతూ మహేశ్ ఏమైనా రాజకీయాల్లోకి కూడా వస్తాడా? అనే చర్చలు జరుగుతూనే ఉన్నాయి. వాటిని మహేశ్ ఎప్పటికప్పుడు తోసిపుచ్చుతూనే వస్తున్నాడు. తాజాగా మరోసారి కూడా మహేశ్ రాజకీయ రంగ ప్రవేశం గురించి వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఈ నేపథ్యంలో రీసెంట్ ఇంటర్వ్యూలో మహేశ్ తన పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న వార్తలకు క్లారిటీ ఇచ్చేశాడు. తనకు సినిమాలు మాత్రమే తెలుసునని, సినిమాలే తన లోకమని, రాజకీయాలు తెలియవని ఆయన మరోసారి తన పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న రూమర్స్‌కు క్లారిటీ ఇచ్చేశారు.
ఈ ఏడాది సంక్రాంతికి మహేశ్ హీరోగా నటించిన 26వ చిత్రం `సరిలేరు నీకెవ్వరు` ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం కుటుంబంతో కలిసి హాలీడే మూడ్‌లో ఉన్నాడు మహేశ్. అయితే ఏప్రిల్ లేదా మే నెలలో మహేశ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మాతగా సినిమా రూపొందనుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు, స్ర్కిప్ట్ వర్క్ జరుగుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com