ప్రభాస్ బాటలో మహేశ్ కూడా...!!
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేశ్ హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. మహేశ్ 27వ చిత్రంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో 40 శాతం చిత్రీకరణను అమెరికాలో చిత్రీకరించాల్సి ఉంది. ఇందులో విలన్ ఇండియాలోని బ్యాంకులను మోసం చేసి అమెరికా పారిపోతాడు. అక్కడ నుండి విలన్‌ను ఇండియా రప్పించి ప్రతి పైసాను బ్యాంకుకు చెల్లించేలా హీరో మహేశ్ చూస్తాడు. కథానుగుణంగా కీలక షెడ్యూల్‌ను ముందుగా అమెరికాలో చిత్రీకరించాలని అనుకున్నారు. అయితే మధ్యలో కరోనా వైరస్ ప్రబలడంతో అమెరికా ప్లాన్‌ను పక్కన పెట్టేశారు.
కాగా.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విధించిన విధి విధానాలతో షూటింగ్స్ చేయాలంటే స్టార్స్ ఉండే సినిమాకు ఇబ్బందిగా మారుతుంది. దీంతో నిర్మాతలు మళ్లీ విదేశాల బాట పట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే ప్రభాస్ అండ్ టీమ్ ఇటీలీ షెడ్యూల్ ప్లాన్ చేసేసింది. కాగా.. మహేశ్ అండ్ టీమ్ అమెరికాకు వెళ్లాలనే అనుకుంటుందట. నవంబర్ నుండి రెగ్యులర్ షూట్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారట. కీర్తిసురేశ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు నిర్మించాలని అనుకుంటున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments