విదేశీ షెడ్యూల్ వద్దన్న మహేశ్!!
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేశ్ హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. మహేశ్ 27వ చిత్రంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో 40 శాతం చిత్రీకరణను అమెరికాలో చిత్రీకరించాల్సి ఉంది. ఇందులో విలన్ ఇండియాలోని బ్యాంకులను మోసం చేసి అమెరికా పారిపోతాడు. అక్కడ నుండి విలన్‌ను ఇండియా రప్పించి ప్రతి పైసాను బ్యాంకుకు చెల్లించేలా హీరో మహేశ్ చూస్తాడు. కథానుగుణంగా కీలక షెడ్యూల్‌ను ముందుగా అమెరికాలో చిత్రీకరించాలని అనుకున్నారు. అయితే కరోనా ఎఫెక్ట్‌తో పరిస్థితి మారింది. హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఇప్పుడు పక్క రాష్ట్రాలకే వెళ్లాలనుకోవడం లేదు. ఇక పక్క దేశాలకు ఏం వెళతారు? అందుకని స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేసుకుంటున్నారట దర్శకులు. ఆ ప్రకారం ‘సర్కారు వారి పేట’ షెడ్యూల్‌ను వద్దనుకున్నాడట మహేశ్.
సరిలేరు నీకెవ్వరుతో ఈ ఏడాది సంక్రాంతికి భారీ హిట్‌ను సొంతం చేసుకున్నాడు మహేశ్. ఇప్పుడు ప్రారంభమైన సర్కారువారి పాట సినిమాలో ఎంటైనర్‌టైన్‌మెంట్ ఫుల్‌గా ఉంటుందట. దీంతో పాటు పవర్‌ఫుల్ మెసేజ్ కూడా ఉంటుందట. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్నిఅందిస్తున్నారు. హీరోయిన్ విషయంలో చిత్ర యూనిట్కు ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే రెగ్యులర్ షూటింగ్‌ను ఎప్పుడు స్టార్ట్ చేయాలనే దానిపై కూడా నిర్ణయం తీసుకుంటారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com