మహేష్ మూవీ టైటిల్ `వాట్సప్`?
Send us your feedback to audioarticles@vaarta.com
మహేష్ నెక్స్ట్ మూవీ గురించి సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన విషయం చెక్కర్లు కొడుతోంది. మహేష్ ఇప్పుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో `మహర్షి` చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 25న విడుదల కానుంది. ఆ తర్వాత నెల రోజులు బాబు సమ్మర్ వెకేషన్‌కి వెళ్తారు. జూన్ నెలాఖరుకు ఆయన ఇండియా చేరుకుంటారట.
వచ్చిన కొన్నాళ్లకు అనిల్ రావిపూడి సెట్స్ కు వెళ్తారట. అనిల్ రావిపూడి ఇప్పటికే కథను ఓకే చేయించుకున్నట్టు సమాచారం. ఈ సినిమాకు వర్కింగ్ టైటిల్ `వాట్సప్` అని అనుకుంటున్నట్టు సమాచారం. సాయిపల్లవి నాయికగా నటించవచ్చని ఫిల్మ్ నగర్ టాక్. ఇటీవల `ఎప్2` సక్సెస్ అయిన సంతోషంలో ఉన్నాడు అనిల్.
అదే ఆనందంతో స్క్రిప్ట్ ను బైండ్ చేసేశారట. మరోవైపు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చడం మొదలుపెట్టారట. అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2020 సంక్రాంతి విడుదలకు సన్నాహాలు చేస్తున్నారని వినికిడి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Iniya Vaishnavi
Contact at support@indiaglitz.com