మహేష్ తదుపరి చిత్రం ఎవరితో..?
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ బ్రహ్మోత్సవం సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్నారు. పి.వి.పి సంస్థ ఈ మూవీని నిర్మిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతుంది. ఈ సినిమా తర్వాత మహేష్ తో సినిమా చేయడానికి పూరి జగన్నాథ్, వి.వి.వినాయక్, త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి, విక్రమ్ కుమార్...ఇలా చాలా మంది డైరెక్టర్స్ లైన్ లో ఉన్నారు.
వీరందరితో పాటు మరో డైరెక్టర్ కూడా లైన్ లో ఉన్నారు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరనుకుంటున్నారా..? ఉత్తమ చిత్రాలను అందించిన ఆ..డైరెక్టరే శేఖర్ కమ్ముల. అవును..శేఖర్ కమ్ముల మహేష్ కోసం కథ రెడీ చేసారు. ప్రస్తుతం కథకి తుది మెరుగులు దిద్దుతున్నారు. అన్ని కుదిరితే...బ్రహ్మోత్సవం తరువాత మహేష్ చేసే సినిమా శేఖర్ మ్ములతో చేసే సినిమానే కావచ్చు అని సమాచారం. ఈ సినిమాని శేఖర్ కమ్ములతో పాటు ఓ డైరెక్టర్ కలసి నిర్మించనున్నారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com