మ‌హేష్ నెక్ట్స్ మూవీ ఫిక్స్..

  • IndiaGlitz, [Saturday,July 02 2016]

సూప‌ర్ స్టార్ మ‌హేష్ హీరోగా క్రేజీ డైరెక్ట‌ర్ మురుగుదాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విష‌యం తెలిసిందే. తెలుగు, త‌మిళ్ లో రూపొందుతున్న ఈ భారీ చిత్రాన్ని ఈనెల 29న ప్రారంభించ‌నున్నారు. ఈ చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ ప‌రిణీతి చోప్రా న‌టిస్తుంది. ఇదిలా ఉంటే....పూరి జ‌గ‌న్నాథ్ తో ఓ మూవీ చేయ‌డానికి మ‌హేష్ ఎప్పుడో గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. అలాగే త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తో కూడా మ‌హేష్ ఓ సినిమా చేయాల‌నుకున్నారు.

అలాగే బ్ర‌హ్మోత్స‌వం ప్లాప్ అవ్వ‌డంతో పి.వి.పి సంస్థ‌కు ఓ సినిమా చేస్తాన‌ని మ‌హేష్ మాట ఇచ్చారు. కొత్త‌గా శ్రీమంతుడు తో బ్లాక్ బ‌ష్ట‌ర్ ఇచ్చిన కొర‌టాల శివ‌తో కూడా సినిమా చేయాలి అనుకుంటున్నాడ‌ట‌. దీంతో మురుగుదాస్ మూవీ త‌ర్వాత మ‌హేష్ ఎవ‌రితో సినిమా చేస్తాడ‌నేది ఆస‌క్తిగా మారింది. అయితే...తాజా స‌మాచారం ప్ర‌కారం...మ‌హేష్ మురుగుదాస్ మూవీ త‌ర్వాత వంశీ పైడిప‌ల్లితో సినిమా చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌. ఈ చిత్రాన్ని పి.వి.పి సంస్థ నిర్మించ‌నుంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించి అఫిషియ‌ల్ ఎనౌన్స్ మెంట్ రానుంద‌ని తెలిసింది.

More News

కబాలి ఫ్లైట్ డిజైన్స్ స్టోరీ..

సూపర్ స్టార్ రజనీకాంత్ లేటెస్ట్ సెన్సేషన్ కబాలి.ఈ చిత్రాన్ని యువ దర్శకుడు రంజిత్ తెరకెక్కించారు.

భానుశంకర్ చౌదరి అర్ధనారికి బంపర్ ఆఫర్..

రాజు మహరాజు,సరదాగా అమ్మాయితో..తదితర చిత్రాలను తెరకెక్కించిన భానుశంకర్ చౌదరి తాజా చిత్రం అర్ధనారి.

సైమా విజేతల వివరాలు...

తెలుగు,తమిళ,కన్నడ,మలయాళ చిత్ర పరిశ్రమల్లో గత సంవత్సరం విడుదలైన చిత్రాలకు గాను ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా ఇచ్చే సైమా అవార్డ్స్ వేడుకను ఈ సంవత్సరం సింగపూర్ లో ఘనంగా నిర్వహించారు.

అడవి శేష్ తో అభిషేక్ అగర్వాల్ (ఎ.సి.ఎల్)

క్షణం సినిమాలో హీరోగా నటించడంతో పాటు కథ-స్ర్కీన్ ప్లే అందించి ఘన విజయం సాధించిన మల్టీటాలెంటెడ్ పర్సన్ అడవి శేష్.

సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సైమా సెల్ఫీ

సింగపూర్ లో జరుగుతున్న సైమా వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి హాజరైన విషయం తెలిసిందే.