మహేష్ న్యూయర్ ప్లాన్స్
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం క్రేజీ డైరెక్టర్ మురుగుదాస్ తో ఓ భారీ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. తెలుగు, తమిళ్ లో రూపొందుతున్న ఈ భారీ చిత్రం గుజరాత్ లోని అహ్మాదాబాద్ లో షూటింగ్ జరుపుకుంది. మహేష్, ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్న ఎస్.జె.సూర్య, తమిళ యువ హీరో భరత్ లపై యాక్షన్ సీన్స్ చిత్రీకరించారు.
ఇటీవలే అహ్మాదాబాద్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. నెక్ట్స్ షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి కాస్త గ్యాప్ ఇచ్చారు. ఈ గ్యాప్ లో మహేష్ తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి విదేశాలకు వెళ్లనున్నారు. క్రిస్మస్, న్యూయర్ లను విదేశాల్లోనే సెలబ్రేట్ చేసుకుని అనంతరం హైదరాబాద్ రానున్నట్టు సమాచారం. నూతన సంవత్సర కానుకగా ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సమ్మర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com