మహేశ్ న్యూ ఇయర్ ప్లానింగ్..!
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేశ్ సినిమాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో, ఫ్యామిలీకి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. ఏమాత్రం తీరిక దొరికినా కుటుంబంతో సమయాన్ని గడపడటానికి చూస్తారు. కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళుతుంటారు. లాక్‌డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైన మహేశ్ తదుపరి తన 27వ చిత్రం 'సర్కారువారిపాట'కు సన్నద్ధమవుతున్నారు. తొలి షెడ్యూల్‌ను అమెరికాలో చిత్రీకరించబోతున్నారు. సినిమాలో 40 శాతం చిత్రీకరణ అమెరికాలోనే జరగనుందట. అందుకోసం 45 రోజుల పాటు షెడ్యూల్ ప్లానింగ్ రెడీ అయ్యింది. ఇప్పుడు వీసా పనులు జరుగుతున్నాయి. అంతా ఓకే అయితే, యూనిట్ అంతా జనవరి మొదటివారంలో అమెరికా చేరుకుంటారట.
అయితే అంత కంటే ముందుగానే అంటే డిసెంబర్ చివరి వారంలోనే మహేశ్ కుటుబంతో కలిసి అమెరికా చేరుకుంటాడట. అమెరికాలోనే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్లాన్ చేశాడట మహేశ్. కీర్తిసురేశ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇందులో విలన్ ఇండియాలోని బ్యాంకులను మోసం చేసి అమెరికా పారిపోతాడు. అక్కడ నుండి విలన్‌ను ఇండియా రప్పించి ప్రతి పైసాను బ్యాంకుకు చెల్లించేలా హీరో మహేశ్ చేస్తాడనేదే కథాంశమని వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com