ఫ్యాన్స్ సందడితో మహేశ్ సరికొత్త రికార్డ్
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేశ్.. టాలీవుడ్ అగ్ర కథానాయకుల్లో ఒకరు. ఇండియన్ సినిమా ప్రేక్షకులకు సుపరిచితమైన నటుడని కూడా చెప్పొచ్చు. ఈయన్ని అభిమానులు ఎంతగా ఆదరిస్తారనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ అభిమాన గణం చేసిన సందడి కారణంగా మహేశ్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఓ రికార్డ్ క్రియేట్ చేశారట. వివరాల్లోకెళ్తే.. ఆగస్ట్ 9న సూపర్‌స్టార్ మహేశ్ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన డీపీని ఆదివారం రోజున ఆయన అభిమానులు విడుదల చేశారు. హ్యాపీ బర్త్‌డే మహేష్ సీడీపీని హ్యాష్‌ట్యాగ్‌తో ట్రెండ్ చేయడం ప్రారంభించారు. ఈ ట్రెండింగ్ ఏ రేంజ్‌లో ఉందంటే ఇండియాలోనే ఓ హీరోకు లేనంతగా ట్వీట్స్‌తో ట్రెండింగ్ అయ్యింది. ఏకంగా 31.1 మిలియన్స్ అంటే.. 3.1 కోట్ల ట్వీట్స్‌తో ట్రెండ్ అయిన ఇండియన్ స్టార్‌గా మహేశ్ ఓ రికార్డును క్రియేట్ చేయడం విశేషం. రీసెంట్‌గా ఈ పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఆయన డీపీని ట్వీట్స్‌తో ట్రెండ్ చేస్తే అది 2.7 కోట్లతో ట్రెండింగ్‌లో నెంబర్ వన్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ రికార్డులను మహేశ్ ఫ్యాన్స్ క్రాస్ చేశారు.
ఇక సినిమాల విషయానికి వస్తే మహేశ్ ప్రస్తుతం తన 27వ చిత్రం ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్‌ను మొదలు పెట్టడానికి సరౌన సమయం కోసం వెయిట్ చేస్తున్నారు. పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్ హీరోయిన్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com