మ‌హేష్ కొత్త లుక్ ఎంతసేపు ఉంటుందంటే..

  • IndiaGlitz, [Tuesday,June 12 2018]

ఇటీవ‌ల విడుద‌లైన భ‌ర‌త్ అనే నేనుతో ఘ‌న‌విజ‌యాన్ని అందుకున్నారు సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు. ప్ర‌స్తుతం త‌న 25వ చిత్రంలో న‌టించ‌డానికి సిద్ధ‌మవుతున్నారు. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న ఈ చిత్రం ఈ నెల 18 నుంచి డెహ్ర‌డూన్‌లో ప్రారంభం కానుంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో మ‌హేష్ కొత్త లుక్‌తో క‌నిపించ‌నున్న సంగ‌తి తెలిసిందే. కొత్త హెయిర్ స్టైల్‌, గ‌డ్డం, మీసం లుక్‌తో ఆయ‌న సంద‌డి చేయ‌నున్నారు. అయితే.. ఈ లుక్‌కు సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే.. సినిమాలో ఈ లుక్ కేవ‌లం కాలేజ్‌కు సంబంధించిన స‌న్నివేశాల్లో మాత్ర‌మే ఉంటుంది.

ఈ సీన్స్ 30 - 35 నిమిషాలు ఉంటాయ‌ని తెలుస్తోంది. మిగిలిన సినిమాలో వేరే లుక్‌తో మ‌హేష్ క‌నిపించ‌నున్నారు. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టించ‌నున్న ఈ సినిమాని ప్ర‌ముఖ నిర్మాత‌లు దిల్ రాజు, అశ్వ‌నీద‌త్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.