కొత్త కాంబినేషన్ లో మహేష్ చిత్రానికి రంగం సిద్ధం...
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీమంతుడు` చిత్రం సూపర్ సక్సెస్ కావడమే కాకుండా వందకోట్ల క్లబ్ లో చేరిన హీరోగా మహేష్ బాబును నిలబెట్టింది. ఈ చిత్రం సక్సెస్ తో మహేష్ నెక్స్ ట్ మూవీస్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ తదుపరి బ్రహ్మోత్సవం` చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాడు.
బ్రహ్మోత్సవం` తర్వాత పూరి జగన్నాథ్ తో సినిమా అని, త్రివిక్రమ్ సినిమా అని, రాజమౌళి సినిమా అంటూ రకరకాల వార్తలు వినపడుతున్నాయి. ఈ లిస్టులో వినాయక్ కూడా ఉన్నాడు. ఇటీవల శ్రీమంతుడు` ఆడియో వేడుకలో కూడా వినాయక్ మహేష్ తో సినిమా చేయాలనుందని కథను సిద్ధం చేస్తున్నానని కుదిరితే సినిమా ట్రాక్ ఎక్కుతుందని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో మహేష్ హీరోగా ఓ సినిమా రూపకల్పనకు రంగం సిద్ధమవుతోందని టాక్.
ఈ చిత్రాన్ని డి.వి.వి.దానయ్య నిర్మిస్తాడని, దానయ్య మాత్రం మహేష్ తో సినిమా చేయడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడట. మహేష్ డేట్స్ ఇస్తాడని ఎదురుచూస్తున్నాడట. ఈ సినిమా కథ కోసం కోనవెంకట్, గోపిమోహన్ లు అల్రెడి ప్రయత్నాలు మొదలెట్టేశారని సమాచారం. మరి ఇందులోనిజానిజాలు తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com