కొత్త కాంబినేషన్ లో మహేష్ చిత్రానికి రంగం సిద్ధం...

  • IndiaGlitz, [Wednesday,August 19 2015]

శ్రీమంతుడు' చిత్రం సూపర్ సక్సెస్ కావడమే కాకుండా వందకోట్ల క్లబ్ లో చేరిన హీరోగా మహేష్ బాబును నిలబెట్టింది. ఈ చిత్రం సక్సెస్ తో మహేష్ నెక్స్ ట్ మూవీస్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ తదుపరి బ్రహ్మోత్సవం' చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాడు.

బ్రహ్మోత్సవం' తర్వాత పూరి జగన్నాథ్ తో సినిమా అని, త్రివిక్రమ్ సినిమా అని, రాజమౌళి సినిమా అంటూ రకరకాల వార్తలు వినపడుతున్నాయి. ఈ లిస్టులో వినాయక్ కూడా ఉన్నాడు. ఇటీవల శ్రీమంతుడు' ఆడియో వేడుకలో కూడా వినాయక్ మహేష్ తో సినిమా చేయాలనుందని కథను సిద్ధం చేస్తున్నానని కుదిరితే సినిమా ట్రాక్ ఎక్కుతుందని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో మహేష్ హీరోగా ఓ సినిమా రూపకల్పనకు రంగం సిద్ధమవుతోందని టాక్.

ఈ చిత్రాన్ని డి.వి.వి.దానయ్య నిర్మిస్తాడని, దానయ్య మాత్రం మహేష్ తో సినిమా చేయడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడట. మహేష్ డేట్స్ ఇస్తాడని ఎదురుచూస్తున్నాడట. ఈ సినిమా కథ కోసం కోనవెంకట్, గోపిమోహన్ లు అల్రెడి ప్రయత్నాలు మొదలెట్టేశారని సమాచారం. మరి ఇందులోనిజానిజాలు తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే...

More News

చిరు సాంగ్ మాత్రం అప్పుడేనట...

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ముందుకు కెళుతున్నాడు.

ఆగస్ట్ 26న 'ది ఐస్' ఆడియో విడుదల

రామ్ గోపాల్ వర్మ ‘365 డేస్’ చిత్రాన్ని నిర్మించిన యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ డి.వి.వెంకటేష్ నిర్మాతగా డి.వి.సినీ క్రియేషన్స్ బ్యానర్ పై

మరో మామ, అల్లుడు కథ ప్రారంభమైంది...

మంచు మోహన్ బాబు, రమ్యకృష్ణ, అల్లరి నరేష్, పూర్ణ వంటి కాంబినేషన్ లో 24ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై

అన్నీ ఎలిమెంట్స్ లో 'కిక్' ను మించేలా 'కిక్-2' ఉంటుంది - రవితేజ

మాస్‌ మహారాజా రవితేజ, సురేందర్‌రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన ‘కిక్‌’ ఎంత సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో అందరికీ తెలిసిందే.

జగపతిబాబు ఆటో బయోగ్రఫీతో రూపొందనున్న 'సముద్రం'

ప్రతి ఒక్కరి జీవితాన్ని సముద్రంతో పోల్చుతుంటాం. ఎన్నో ఆటుపోట్లతో కూడుకున్న మనిషి జీవితం ఒక్కొక్క దరిని చేరుతుంటుంది.