మహేశ్ కొత్త వ్యాపారం...!!
Send us your feedback to audioarticles@vaarta.com
హీరోగానే కాదు.. నిర్మాతగా, ఎంటర్ ప్రెన్యూరర్‌గా మహేశ్ నేటి తరం హీరోల్లో తనదైన స్టైల్లో దూసుకెళ్తున్నారు. అయితే త్వరలోనే మహేశ్ కొత్త వ్యాపారస్థుడిగా కనిపించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకూ మహేశ్ ఏ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారనే ఆసక్తి కలగకమానదు. ఆసక్తికరమైన విషయమేమంటే.. మహేశ్ వ్యాపారం చేయబోయేది రియల్ లైఫ్‌లోకాదు.. రీల్ లైఫ్‌లో. బిజినెస్‌మేన్‌లో గ్యాంగ్‌స్టర్ నుండి బ్యాంకు అధినేతగా ఎదుగుతాడు మహేశ్. అలాగే శ్రీమంతుడులో పెద్ద వ్యాపారాలున్న వ్యక్తిగా కనిపిస్తారు. ఇప్పుడు తను చేయబోయే 27వ చిత్రం ‘సర్కారువారి పాట’లోనూ మహేశ్ బిజినెస్‌మేన్‌గా కనిపిస్తారట. ఇంతకూ మహేశ్ ఎలాంటి బిజినెస్‌మేన్‌గా కనిపిస్తారు? అనే సందేహం కలుగకమానదు.
వివరాల్లోకెళ్తే.. సూపర్‌స్టార్ మహేశ్, పరుశురాం కాంబినేషన్‌లో ‘సర్కారువారి పాట’ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ ప్రభావం వల్ల ఆగిన ఈ సినిమా సెట్స్‌పై వెళ్లడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో మహేశ్ క్యారెక్టర్‌పై పలు రకాలైన వార్తలు వినిపిస్తున్నాయి. లేటెస్ట్ సమాచారం మేరకు ‘సర్కారువారి పాట’ ఫైనాన్స్ చేసే వ్యాపారిగా కనిపిస్తారట. ఇప్పటి వరకు మహేశ్ కనిపించిన పాత్రలకు ఈ పాత్ర భిన్నమైందనే చెప్పొచ్చు. మరి వడ్డీవ్యాపారిగా మహేశ్ ఎలా మెప్పించనున్నారో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com