సినిమాల్లోకి మ‌హేష్ మేన‌ల్లుడు

  • IndiaGlitz, [Monday,November 27 2017]

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు మేన‌ల్లుడు..తెలుగు దేశం పార్టీ పార్ల‌మెంట్ స‌భ్యుడు గ‌ల్లా జ‌య‌దేవ్ త‌న‌యుడు గ‌ల్లా అశోక్ సినీ రంగ ప్ర‌వేశం చేయ‌నున్నారు.

కృష్ణ త‌న‌య , మ‌హేష్ సోద‌రి ప‌ద్మావ‌తి, జ‌య‌దేవ్‌ల కొడుకే ఈ అశోక్‌. త‌ను ప్ర‌స్తుతం న‌ట‌న‌లో శిక్ష‌ణ తీసుకుంటున్నాడ‌ట‌. ఈ సినిమాను ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తాడని వార్త‌లువిన‌ప‌డుతున్నాయి. అయితే డైరెక్ట‌ర్ ఎవ‌ర‌నేది మాత్రం తెలియ‌డం లేదు.

అయితే విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాను కొత్త ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించే అవ‌కాశాలే క‌న‌ప‌డుతున్నాయి. మ‌రి మ‌హేష్ మేన‌ల్లుడు యాక్ష‌న్ సినిమా ద్వారా ప‌రిచ‌యం అవుతాడో లేక ల‌వ్ సినిమా ద్వారా ప‌రిచ‌యం అవుతాడో చూడాలి.

More News

సూర్య 'గ్యాంగ్'?

హీరో సూర్య‌, విఘ్నేష్ శివ‌న్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం తానా సెంద కూట్ట‌మ్‌. స్టూడియో గ్రీన్ బ్యాన‌ర్‌పై జ్ఞాన‌వేల్ రాజా నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో గ్యాంగ్ అనే పేరుతో విడుద‌ల చేస్తున్నారు.

కీర్తి తెలుగు డ‌బ్బింగ్‌?

చ‌క్క‌నమ్మా ఏం ప‌లికినా అంద‌మే..అనే రీతిలో ఏ భాష నుండి అయినా తెలుగులోకి వ‌స్తున్న హీరోయిన్స్ అంద‌రూ ఇప్పుడు తెలుగును నేర్చుకోవ‌డానికి ఆస‌క్తిని చూపుతున్నారు. రాశిఖ‌న్నా లాంటివారు తెలుగు భాష‌ను నేర్చుకోవ‌డ‌మే కాదు, ఏకంగా పాట‌లు కూడా పాడేస్తున్నారు.

జ‌న‌వరి 20 నుంచి హిట్ కాంబినేష‌న్ చిత్రం

ద‌ర్శ‌కుడు ఎ.ఆర్.మురుగదాస్, త‌మిళ క‌థానాయ‌కుడు విజయ్ లది సూపర్ హిట్ కాంబినేష‌న్‌. ఇప్ప‌టికే తుపాకి, క‌త్తి (ఖైదీ నెం.150 ఒరిజ‌న‌ల్ వెర్ష‌న్‌) చిత్రాల‌తో ఈ ఇద్ద‌రు రెండు విజ‌యాల‌ను సొంతం చేసుకున్నారు.

దుబాయ్‌లో 'జై సింహా'

నటసింహ బాలకృష్ణ నటిస్తున్న 102వ చిత్రం 'జై సింహా'. న‌య‌న‌తార‌, హ‌రిప్రియ‌, న‌టాషా దోషి క‌థానాయిక‌లు. కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

బ‌న్ని బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెర‌కెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘నా పేరు సూర్య’. ర‌చ‌యిత వక్కంతం వంశీ మొదటిసారిగా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.