మహేష్ అన్న తనయుడు సినిమాల్లోకి...

  • IndiaGlitz, [Thursday,March 01 2018]

సూప‌ర్‌స్టార్ కృష్ణ త‌న‌యుడు సూప‌ర్‌స్టార్ మ‌హేష్ సినిమాల్లో టాప్ స్టార్‌గా రాణిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఘ‌ట్ట‌మ‌నేని మూడోత‌రం హీరోలు సినీ రంగ ప్ర‌వేశానికి రంగం సిద్ధ‌మవుతున్నాయి. మ‌హేష్ కుటుంబం నుండి గ‌ల్లా జ‌య‌దేవ్ త‌న‌యుడు ఇప్ప‌టికే సినీ రంగం వైపు దృష్టి సారిస్తున్నాడు.

దీంతో పాటు మ‌హేష్ అన్న‌య్య ఒక‌ప్పుడు హీరోగా న‌టించిన ర‌మేష్ బాబు త‌న‌యుడు జ‌య‌కృష్ణ కూడా సినిమా రంగంలోకి త్వ‌ర‌లోనే ఎంట్రీ ఇస్తున్నాడ‌ట‌. వైజాగ్‌లో స‌త్యానంద్ వ‌ద్ద శిక్ష‌ణ తీసుకుంటున్నాడ‌ట జ‌య‌కృష్ణ‌. దాదాపు వ‌చ్చే ఏడాది జ‌య‌కృష్ణ సినీ రంగ ప్రవేశం ఉంటుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.