పోలీసులకు సెల్యూట్ చేసిన మహేశ్, చైతన్య
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా వైరస్‌ను నివారించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కర్ఫ్యూను విధించాయి. ముఖ్యంగా పోలీసు శాఖవారు ప్రజలను రోడ్ల మీదకు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా సూపర్‌స్టార్ మహేశ్ తెలంగాణ పోలీసులకు ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ‘‘కోవిడ్ 19పై ఆలుపెరుగని పోరాటం చేస్తున్న తెలంగాణ పోలీసులకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా వారెంతో కష్టపడుతున్నారు. ఇలా ప్రతికూల పరిస్థితుల్లోనూ మన ప్రాణాలు, మన కుటుంబ ప్రాణాలకు రక్షణ కవచంలా నిలుస్తున్నారు. పోలీస్ శాఖవారి రుణం తీర్చుకోలేం. మన దేశం పట్ల, ప్రజల పట్ల డేడికేషన్‌తో పనిచేస్తున్న పోలీసులకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం’’ అన్నారు.
సెల్యూట్ అంటున్న చైతన్య:
మరో టాలీవుడ్ హీరో నాగచైతన్య సైతం పోలీసుల పడుతున్న కృషిని అప్రిషియేట్ చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ‘‘రెండు, మూడు వారాలుగా మన ప్రజల కోసం పోలీసులు ఎంతో కష్టపడుతున్నారు. ప్రజల రక్షణ కోసం పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యలు అభినందనీయం. వారు మన కోసం వారిత పాటు వారి కుటుంబ సభ్యుల ప్రాణాలను రిస్క్‌లో పెట్టి పోరాడుతున్నారు. ఈ సందర్భంగా పోలీసు శాఖను అభినందిస్తున్నాను. ఓ రకంగా వారందరూ మనకెంతో ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు. హ్యాట్సాఫ్ టు పోలీస్’’ అన్నారు.
I want to take this moment to wholeheartedly thank the Telangana police force for spearheading the battle against COVID-19. Their relentless hard work is absolutely outstanding. pic.twitter.com/RKFS5HgWsD
— Mahesh Babu (@urstrulyMahesh) April 9, 2020
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments