పోలీసుల‌కు సెల్యూట్ చేసిన మ‌హేశ్‌, చైత‌న్య‌

క‌రోనా వైర‌స్‌ను నివారించ‌డానికి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌ఠిన‌మైన నిర్ణ‌యాలు తీసుకుంటున్నాయి. క‌ర్ఫ్యూను విధించాయి. ముఖ్యంగా పోలీసు శాఖ‌వారు ప్ర‌జ‌లను రోడ్ల మీద‌కు రాకుండా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ తెలంగాణ పోలీసుల‌కు ట్విట్ట‌ర్ ద్వారా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ‘‘కోవిడ్ 19పై ఆలుపెరుగ‌ని పోరాటం చేస్తున్న తెలంగాణ పోలీసుల‌కు నా హృద‌య‌పూర్వ‌క‌మైన ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నాను. ఎలాంటి ప్ర‌తిఫ‌లం ఆశించకుండా వారెంతో క‌ష్ట‌ప‌డుతున్నారు. ఇలా ప్ర‌తికూల ప‌రిస్థితుల్లోనూ మ‌న ప్రాణాలు, మ‌న కుటుంబ ప్రాణాలకు ర‌క్ష‌ణ క‌వ‌చంలా నిలుస్తున్నారు. పోలీస్ శాఖ‌వారి రుణం తీర్చుకోలేం. మ‌న దేశం ప‌ట్ల‌, ప్ర‌జ‌ల ప‌ట్ల డేడికేష‌న్‌తో ప‌నిచేస్తున్న పోలీసుల‌కు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం’’ అన్నారు.

సెల్యూట్ అంటున్న చైత‌న్య‌:

మ‌రో టాలీవుడ్ హీరో నాగ‌చైత‌న్య సైతం పోలీసుల ప‌డుతున్న కృషిని అప్రిషియేట్ చేస్తూ ఓ వీడియో విడుద‌ల చేశారు. ‘‘రెండు, మూడు వారాలుగా మన ప్రజల కోసం పోలీసులు ఎంతో క‌ష్ట‌ప‌డుతున్నారు. ప్ర‌జ‌ల ర‌క్ష‌ణ కోసం పోలీసు శాఖ తీసుకుంటున్న చ‌ర్య‌లు అభినంద‌నీయం. వారు మ‌న కోసం వారిత పాటు వారి కుటుంబ స‌భ్యుల ప్రాణాల‌ను రిస్క్‌లో పెట్టి పోరాడుతున్నారు. ఈ సంద‌ర్భంగా పోలీసు శాఖ‌ను అభినందిస్తున్నాను. ఓ ర‌కంగా వారంద‌రూ మ‌న‌కెంతో ఇన్‌స్పిరేష‌న్‌గా నిలుస్తున్నారు. హ్యాట్సాఫ్ టు పోలీస్‌’’ అన్నారు.

More News

భారీ రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న ఆలియా

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ప్రెస్టీజియ‌స్ చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం’(ఆర్ఆర్ఆర్‌).

మ‌నవ‌డి కోసం మెగాఫోన్ ప‌ట్టిన కృష్ణ‌

తెలుగు సినిమాను సాంకేతికంగా కొత్త పుంత‌లు తొక్కించే దిశ‌గా అడుగులు వేసిన హీరోల్లో సూప‌ర్‌స్టార్ కృష్ణ ఎప్పుడూ ముందుంటారు. 350 సినిమాల్లో న‌టించిన కృష్ణ‌.. నిర్మాత‌గానే కాదు,

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే..

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

కరోనా నేపథ్యంలో ఐటీ శాఖ కీలక నిర్ణయం

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని కాటేస్తున్న తరుణంలో.. ఐటీ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.5లక్షల కంటే తక్కువ ఉన్న పెండింగ్ ఇన్ కం ట్యాక్స్ రీ ఫండ్స్‌ను

డిశ్చార్జ్ అయిన కనికాకు కొత్త చిక్కులు!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి బారి నుంచి బాలీవుడ్ ప్రముఖ గాయని కనికాకపూర్ ఎట్టకేలకు కోలుకున్న సంగతి తెలిసిందే. గత 14 రోజులకుపైగా కరోనాపై పోరాడిన