మహేష్ - మురుగుదాస్ విలన్ వెనక కథ..
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ - మురుగుదాస్ కాంబినేషన్లో రూపొందతున్న చిత్రం ఏప్రిల్ లో ప్రారంభం కావాలి. కానీ...కొన్ని కారణాల వలన జూన్ లో ప్రారంభించనున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే...ఈ భారీ చిత్రంలో విలన్ గా మహేష్ తో సినిమా తీసిన దర్శకుడు నటిస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి. ఆతర్వాత ఆ దర్శకుడు ఎవరో కాదు మహేష్ తో నాని సినిమా తీసిన ఎస్.జె.సూర్య అని తెలిసింది. అయితే కోలీవుడ్ సమాచారం ప్రకారం ఎస్.జె.సూర్య మహేష్ సినిమాలో విలన్ గా నటించడం కన్ ఫర్మ్ అట. మురుగుదాస్..ఎస్.జె.సూర్యని విలన్ రోల్ కి సెలెక్ట్ చేయడానికి ఓ కారణం ఉందట.
ఇంతకీ కారణం ఏమిటంటే...ఎస్.జె.సూర్య దగ్గర మురుగుదాస్ అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసారట.ఆతర్వాత అజిత్ తో మురుగుదాస్ ధీన అనే సినిమా తెరకెక్కించారు. మురుగుదాస్ తో ఈ సినిమా చేయమని అజిత్ కి చెప్పిందే ఎస్.జె.సూర్య అట. అప్పటి నుంచి గురు శిష్యులు సూర్య - మురుగుదాస్ వీరిద్దరికి మంచి అనుబంధం ఏర్పడిందట. అందుకనే గురువు సూర్యకి శిష్యుడు మురుగుదాస్ తన తాజా చిత్రంలో అవకాశం ఇచ్చాడట. అది మహేష్ - మురుగుదాస్ మూవీలో విలన్ వెనక కథ
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments