మహేష్ - మురుగుదాస్ టైటిల్ & ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్..!
Saturday, November 19, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ - క్రేజీ డైరెక్టర్ మురుగుదాస్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రం తెలుగు, తమిళ్ లో దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతుంది. ఈ భారీ చిత్రంలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది.ఇటీవల హైదరాబాద్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఆతర్వాత చెన్నైలో కొన్నియాక్షన్ సీన్స్ చిత్రీకరించారు. డిసెంబర్ కి షూటింగ్ మొత్తం పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి వాస్కోడిగామా, ఎనిమీ, అభిమన్యుడు ఇలా కొన్ని టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. ఇదిలా ఉంటే... తాజాగా ఏజెంట్ శివ, ఏజెంట్ 007 ఈ రెండు టైటిల్స్ లో ఏదో ఒకటి కన్ ఫర్మ్ చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఇక టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను కూడా రిప్లబిక్ డే సందర్భంగా జనవరి 26న రిలీజ్ చేయనున్నట్టు సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments