మహేష్ - మురుగుదాస్ టైటిల్ & ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

  • IndiaGlitz, [Saturday,November 19 2016]

సూప‌ర్ స్టార్ మ‌హేష్ - క్రేజీ డైరెక్ట‌ర్ మురుగుదాస్ కాంబినేష‌న్లో రూపొందుతున్న చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ చిత్రం తెలుగు, త‌మిళ్ లో దాదాపు 100 కోట్ల భారీ బ‌డ్జెట్ తో రూపొందుతుంది. ఈ భారీ చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుంది.ఇటీవ‌ల హైద‌రాబాద్ లో కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. ఆత‌ర్వాత చెన్నైలో కొన్నియాక్ష‌న్ సీన్స్ చిత్రీక‌రించారు. డిసెంబ‌ర్ కి షూటింగ్ మొత్తం పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి వాస్కోడిగామా, ఎనిమీ, అభిమ‌న్యుడు ఇలా కొన్ని టైటిల్స్ ప్ర‌చారంలో ఉన్నాయి. ఇదిలా ఉంటే... తాజాగా ఏజెంట్ శివ, ఏజెంట్ 007 ఈ రెండు టైటిల్స్ లో ఏదో ఒక‌టి క‌న్ ఫ‌ర్మ్ చేస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇక టైటిల్ తో పాటు ఫ‌స్ట్ లుక్ ను కూడా రిప్ల‌బిక్ డే సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 26న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.

More News

రామ్ చరణ్ కి ప్రతిష్ఠాత్మక పురస్కారం

సినిమా రంగంలో అసాధారణ విజయాలు సాధించి,విమర్శకుల ప్రశంసలను అందుకుంటూ..

డిఫ‌రెంట్ గెట‌ప్స్ లో నాని - కీర్తిల లోక‌ల్ సెల్ఫీ 1

నేచుర‌ల్ స్టార్ నాని - నేను శైల‌జ ఫేమ్ కీర్తి సురేష్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం నేను లోక‌ల్. ఈ చిత్రాన్ని సినిమా చూపిస్త మావ త్రినాథ‌రావు న‌క్కిన తెర‌కెక్కిస్తున్నారు.

భగవంతుడు అంటే ఏమిటో చెప్పిన పవన్..!

ప్రముఖ న్యూస్ ఛానల్ ఎన్.టీవీ ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న అథ్యాత్మిక కార్యక్రమం కోటి దీపోత్సవం.

సమంతకు నితిన్ థాంక్స్.....

హీరో నితిన్,ఫ్యాషన్ డిజైనర్ నీరజ కోనా ఇప్పుడు అతిథ్య రంగంలోకి అడుగుపెట్టారు.

మహేష్ సినిమా వెనక్కి వెళ్లింది...

సూపర్ స్టార్ మహేష్,డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో మరో సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే.