మహేష్ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ డీటైల్స్..!

  • IndiaGlitz, [Friday,January 13 2017]

సూపర్ స్టార్ మ‌హేష్ - క్రేజీ డైరెక్ట‌ర్ మురుగుదాస్ కాంబినేష‌న్లో రూపొందుతున్న భారీ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ్ లో దాదాపు 100 కోట్ల భారీ బ‌డ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుంది. ప్ర‌స్తుతం ఈ చిత్రం హైద‌రాబాద్ లోని అమీర్ పేట‌లో గ‌ల జెనిటిక్స్ బిల్డింగ్స్ లో షూటింగ్ జ‌రుపుకుంటుంది.

ఇదిలా ఉంటే...ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ ను నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 1న రిలీజ్ చేస్తారు అంటూ ప్ర‌చారం జ‌రిగింది కానీ రిలీజ్ చేయ‌లేదు. బ్ర‌హ్మోత్స‌వం ఫ్లాప్ అవ్వ‌డంతో కాస్త నిరాశ‌లో ఉన్న ఫ్యాన్స్ సంక్రాంతికి అయినా ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేస్తార‌ని ఎదురు చూసారు అది జ‌ర‌గ‌డం లేదు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం....ఈ నెలాఖ‌రున ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. టైటిల్ ఏమిటి అనేది ఇంకా నిర్ణ‌యించ‌లేదు. ఈ క్రేజీ మూవీకి హ‌రిస్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు.