మహేష్ సినిమాకు సమస్య...
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో ఓ సినిమాకు రూప కల్పన జరుగుతుంది. నిజానికి ఈ సినిమాను పివిపి సినిమా నిర్మిస్తుందని అనుకున్నారు. అందుకు కారణం అంతకు ముందు పివిపి సినిమా బ్యానర్‌లో మహేష్ నటించిన బ్రహ్మోత్సవం అట్టర్ ప్లాప్ కావడంతో డిస్ట్రిబ్యూటర్స్ భారీగా నష్టపోయారు. ఈ నష్ట నివారణ చర్యల్లో భాగంగా పివిపితో కలిసి వంశీ దర్శకత్వంలో మహేష్ సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి.
అయితే రీసెంట్‌గా ఈ సినిమాను దిల్‌రాజు, అశ్వనీదత్‌లు నిర్మిస్తారని వార్తలు వినిపించాయి. దీంతో పివిపి సినిమా బ్యానర్ మెళిక పెట్టి కోర్టుకు వెళ్లింది. అసలు ముందు ఈ సినిమాను మహేష్‌తో ట్రాక్‌లోకి తెచ్చింది తామేనని, సదరు సినిమా స్క్రిప్ట్ కోసం ఖర్చు పెట్టామని, కాబట్టి ఈ కథను తమ నిర్మాణ సంస్థకే చెందుతుందని, ఈ కథను వంశీ పైడిపల్లి వాడుకోకూడదని చెన్నై హైకోర్టులో కేసు వేయడంతో కోర్టు ఇన్‌జెక్షన్ ఆర్డర్స్ ఇచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments