మహేష్ మూవీ లేటెస్ట్ అప్ డేట్..!
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ - క్రేజీ డైరెక్టర్ మురుగుదాస్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల గుజరాత్ లోని అహ్మాదాబాద్ లో భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించారు. ప్రస్తుతం షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు.
మహేష్ యూరప్ నుంచి వచ్చిన తర్వాత జనవరి 7న తాజా షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ ఏజెంట్ శివగా నటిస్తున్నాడు అని సమాచారం. ఈ చిత్రానికి సంభవామి అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టుగా ప్రచారం జరుగుతుంది. నూతన సంవత్సర కానుకగా ఈ మూవీ టైటిల్ & ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే...ఇప్పటి వరకు అఫిషియల్ గా ఈ విషయాన్ని చిత్రయూనిట్ ఎనౌన్స్ చేయలేదు. మరి...జనవరి 1న ఈ మూవీ టైటిల్ & లోగో రిలీజ్ చేస్తారో లేదో చూడాలి..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com