ఆరు దేశాల్లో మహేష్ మూవీ..
Send us your feedback to audioarticles@vaarta.com
ఇటీవల విడుదలై ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'బాహుబలి2' చిత్రంలో గ్రాఫిక్స్ ఎంత ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయో తెలిసిందే. భారీ సినిమాలకు మంచి కథ, కథనాలు, మంచి ఆర్టిస్టులు ఎంత అవసరమో గ్రాఫిక్స్ కూడా అంతే అవసరం అన్నట్టుగా మారాయి పరిస్థితులు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకు అన్ని హంగులతోపాటు గ్రాఫిక్స్ కూడా ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి. ఇప్పుడు మహేష్ హీరోగా ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు నిర్మిస్తున్న 'స్పైడర్' చిత్రంలో గ్రాఫిక్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు మురుగదాస్. బాహుబలి రిలీజ్ తర్వాత వాటి అవసరం మరింత పెరిగింది. రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.
అందులో భాగంగా గ్రాఫిక్ వర్క్ ఏకకాలంలో ఆరు దేశాల్లో చేయిస్తున్నారు. సెప్టెంబర్ 27న ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యాలంటే గ్రాఫిక్ వర్క్‌ని స్పీడప్ చెయ్యాలి. అందుకే మురుగదాస్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇండియా, రష్యా, ఇరాన్, బ్రిటన్ వంటి దేశాల్లో 'స్పైడర్' వర్క్ జరుగుతోంది. ఒక పాట చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. వచ్చే నెల బ్యాలెన్స్ సాంగ్ తీస్తారట. ప్రస్తుతం వున్న పరిస్థితులు చూస్తుంటే గ్రాఫిక్ వర్క్ త్వరగా పూర్తి చేస్తే గానీ 'స్పైడర్' దసరా బరిలోకి దిగే అవకాశం లేదు. అందుకే గ్రాఫిక్ వర్క్ మొత్తం తన పర్యవేక్షణలోనే జరుపుతున్నాడు మురుగదాస్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments