మహేష్ సినిమా.. నెల రోజుల ఆలస్యం
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ బాబు, ఉత్తరాది భామ పూజా హెగ్డే జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మహేష్ కెరీర్లో 25వ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం.. ప్రస్తుతం డెహ్రాడున్లో తొలి షెడ్యూల్‌ను జరుపుకుంటోంది.
ఈ షెడ్యూల్లో భాగంగా.. మహేష్ స్టూడెంట్‌గా కనిపించనున్న సన్నివేశాలను ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో దాదాపు రెండు నెలల పాటు చిత్రీకరించడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.
అయితే.. ప్రపంచ యోగా డే సందర్భంగా ప్రధాని మోది ఇక్కడ కొన్ని కార్యక్రమాలను నిర్వహించారు. ఈ నేపథ్యంలో భద్రతా దృష్ట్యా.. నెల రోజుల ముందుగానే ఈ ఇన్స్టిట్యూట్ ప్రాంగణం సెక్యూరిటీ సిబ్బంది ఆధీనంలోకి వెళ్ళింది. దీనివలన ఇక్కడ జరగాల్సిన సినిమా షూటింగ్ కాస్త నెల రోజుల ఆలస్యమైందని సమాచారం.
అయితే.. దీనివలన తాము ఎటువంటి నిరుత్సాహానికి గురి కాలేదని చిత్ర యూనిట్ చెబుతూనే.. త్వరలోనే ఇక్కడ కొన్ని సన్నివేశాలను షూట్ చేస్తామని అంటోంది.
కాగా.. అమెరికా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో స్నేహానికి సరికొత్త అర్ధం చెబుతూనే.. రైతు సమస్యలను కూడా చర్చించనున్నట్టు తెలుస్తోంది. అగ్ర నిర్మాత అశ్వనీదత్, 'దిల్' రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com