మహేశ్ సినిమాటోగ్రాఫర్ ఎవరంటే?
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేశ్ సినిమాకు సంబంధించి ప్రతి విషయంలో నిర్మాతలు ఎంతో కేర్ తీసుకుంటూ ఉంటారు. ఈ మధ్య మహేశ్ సినిమాలకు స్టార్ సినిమాటోగ్రాఫర్స్ వర్క్ చేస్తున్నారు. ఇదే ట్రెండ్‌ను మహేష్ 26వ చిత్రం `సరిలేరు నీకెవ్వరు`కు కూడా కంటిన్యూ చేస్తున్నారు. లేటెస్ట్ సమాచారం ప్రకారం మహేష్ 26వ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా రత్నవేలు వర్క్ చేయబోతున్నారట.
`రోబో`, `ఖైదీ నంబర్ 150` సహా పలు స్టార్ చిత్రాలకు సినిమాటోగ్రాపర్‌గా వర్క్ చేసిన రత్నవేలు ఇప్పుడు , సైరా నరసింహారెడ్డి` చిత్రానికి కెమెరా వర్క్ అందిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ త్వరలోనే ముగియనుంది. వెంటనే రాండీ మహేష్ యూనిట్‌తో జాయిన్ కాబోతున్నారని సమాచారం. అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. జూన్ చివరి వారం నుండి సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments