అప్పుడు మహేష్ తల్లి.. ఇప్పుడు అనుపమ తల్లి
Send us your feedback to audioarticles@vaarta.com
'మిస్టర్ పెళ్ళాం, శుభలగ్నం, శుభ సంకల్పం, మావిచిగురు' తదితర చిత్రాలతో అలరించిన నిన్నటితరం కథానాయిక ఆమని. ఇటీవల విడుదలైన ‘భరత్ అనే నేను’ సినిమాలో మహేష్ బాబుకి తల్లి పాత్రలో నటించారు. ఈ సినిమాలో ప్రామిస్‌కి ఉండే గొప్పతనం గురించి కొడుకుకి అర్ధమయ్యేలా చెప్పే సీన్‌లో తన మార్క్ నటనతో ఆకట్టుకున్నారు. ఇదిలా ఉంటే ‘భరత్ అనే నేను’లో హీరో తల్లి పాత్రలో కనిపించిన ఆమని.. తన అప్ కమింగ్ మూవీలో హీరోయిన్‌కి తల్లి పాత్రలో నటించనున్నారని సమాచారం.
ఆ వివరాల్లోకి వెళితే.. దిల్ రాజు నిర్మాణంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్, కేరళ కుట్టి అనుపమ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో అనుపమకి తల్లిగా ఆమని కనిపించనుండగా.. తండ్రిగా ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. ఇక రామ్‌కు తండ్రిగా రావు రమేష్ నటిస్తున్నారు. అయితే ‘భరత్ అనే నేను’లో తల్లిగా ఈ పాత్ర చెప్పిన మాట చుట్టూ కథ తిరుగుతుంది. అదే ఆ సినిమా విజయానికి దోహదపడింది. మరి ఈ సినిమాలో ఆమని పాత్రను దర్శకుడు ఎలా తీర్చిదిద్దనున్నారో తెలియాలంటే మరికొంత కాలం వేచి ఉండాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com