మహేశ్ తప్పు.. ట్రోలింగ్‌తో దిద్దుబాటు?
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ ఇప్పుడు యూనివర్సల్ కాన్సెప్ట్స్‌ను ఎంచుకుంటున్నారు. విజయదశమి సందర్భగా మహేశ్ నేడు అందరికీ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఇక్కడొక చిన్న సమస్య వచ్చి పండింది.
అదేంటంటే మహేష్ అందరికీ విజయదశమి శుభాకాంక్షలను తెలియజేశారు. అంతే కాకుండా.. ఈ శుభాకాంక్షలను తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో తెలియజేశారు. కర్ణాటకలో విషెష్ చెప్పలేదు. ఇప్పుడు ఇది ట్రోలింగ్ అవుతుంది. కర్ణాటక మార్కెట్ మహేశ్‌కు అక్కర్లేదా? అనే ప్రశ్నను అందరూ సంధించారు.
ఎట్టకేలకు కాసేపటికే మహేష్ కన్నడంలో కూడా దసరా శుభాకాంక్షలను తెలిపారు. దక్షిణాదిన కర్ణాటక రాష్ట్రంలో అనువాద చిత్రాలను విడుదల చేయకూడదు. పరభాషా చిత్రాలను స్ట్రయిట్‌గా విడుదల చేసుకోవచ్చు. కాబట్టి మహేశ్ కర్ణాటకను ఫోకస్ చేయడం లేదని కొందరి వాదన. మరి దీనిపై మహేశ్ అండ్ గ్యాంగ్ ఎలా స్పందిస్తారో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments