మహేష్ 'మర్మం'...
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేష్, ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. చిత్రీకరణలో భాగంగా ఇప్పుడు హైదరాబాద్‌లో సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధులు నిర్మాతలుగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను జూన్ 23న విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు ముందు `సంభవామి` అనే టైటిల్‌ను రిజిష్టర్ చేయించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా టైటిల్‌ను మార్చబోతున్నారట. ఈ సినిమాకు `మర్మం` అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. మరి మహేష్ చేయనున్న మర్మమేంటో తెలియాలి. ఈ చిత్రంలో మహేష్ స్పై క్యారెక్టర్ చేస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com