ఇక రెండు నెలలు మహేశ్ కనపడడు...!!
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేశ్ ఈ సంక్రాంతికి `సరిలేరునీకెవ్వరు`తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పెద్ద సక్సెస్‌ను సొంతం చేసుకన్న సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్‌ల నుండి ఏమాత్రం ఖాళీ దొరికినా ఫ్యామిలీతో పాటు వెకేషన్స్‌కు చెక్కేసే మహేష్.. ఇప్పుడు కూడా అదే పనిచేశాడు. మహేశ్, నమ్రత, గౌతమ్, సితారలతో అమెరికాకు ఫ్లైట్ ఎక్కేశారు. వీరితో పాటు మెహర్ రమేష్ కూడా వెళ్లడం విశేషం. ఈ వెకేషన్ రెండు నెలలు పాటు సాగుతుందని వార్తలు వినపడుతున్నాయి. ఫ్యామిలీతో సహా అమెరికా వెళుతుండగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో తీసిన ఫొటోను నమత్ర తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు. మేం వెళ్తున్నాం, హ్యాపీహాలీడేస్, బ్లాక్‌బస్టర్ కా బాప్, సరిలేరు నీకెవ్వరు అనే పదాల హ్యాష్ ట్యాగ్‌లకు కూడా జత చేశారు.
మహేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందిన చిత్రం `సరిలేరు నీకెవ్వరు`. సంక్రాంతి సందర్భంగా జనవరి 11న విడుదలైన ఈ చిత్రం తొలి వారంలోనే 100 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్స్‌ను సాధించింది. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా.. విజయశాంతి కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా కోసం ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా కంటిన్యూగా షూటింగులో పాల్గొన్న మహేశ్... సినిమా విడుదలైన మొత్తం ప్రమోషన్స్ పూర్తవగానే వెకేషన్‌కు వెళ్లిపోయాడు. అదీ కూడా లాంగ్ వెకేషన్. రాగానే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నానని మహేశ్ రీసెంట్ ఇంటర్వ్యూలో తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments