'ఉప్పెన' సాంగ్‌ లాంఛ్ చేసిన మహేశ్‌

  • IndiaGlitz, [Wednesday,November 11 2020]

మెగా క్యాంప్ హీరో సాయితేజ్ సోద‌రుడువైష్ణవ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం‘ఉప్పెన’. ఈ సినిమాలో 'రంగులద్దుకుందాం...' అనే సాంగ్‌ను సూపర్‌స్టార్ మహేశ్‌ విడుదల చేశారు. హీరో, హీరోయిన్‌, దర్శకుడు, తన ఫేవరేట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవిశ్రీ ప్రసాద్‌కు ఈ సందర్భంగా మహేశ్‌ అభినందనలు తెలిపారు. సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై సుకుమార్, మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్ ఈ సినిమాను నిర్మించారు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో క్రితి శెట్టి హీరోయిన్‌గా న‌టించింది. దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.

ఈ సినిమాను ఏప్రిల్ 2న విడుద‌ల చేయాల‌నుకున్నారు. కానీ క‌రోనా ప్ర‌భావంతో సినిమా విడుద‌ల ఆగిపోయింది. సినిమాను ఓటీటీలో విడుద‌ల చేస్తారంటూ వార్త‌లు కూడా విన‌ప‌డ్డాయి. కానీ చివ‌ర‌కు నిర్మాత‌లు సినిమాను థియేట‌ర్స్‌లోనే విడుద‌ల చేయ‌డానికి నిర్ణ‌యించుకున్నారు. ఇప్పుడు థియేటర్స్‌ ఎలాగూ విడుదలయ్యాయి. వచ్చే ఏడాదికి సినిమాలన్నీ థియేటర్స్‌లో రావడానికి సమాయత్తమవుతున్నాయి. ఈ క్రమంలో తమ ఉప్పెన సినిమాపై హైప్‌ పెంచుకోవడానికి సుకుమార్‌ అండ్‌ టీమ్‌ కష్టపడుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన రెండు పాటలకు అద్భతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు మూడో పాటగా విడుదలైన 'రంగులద్దుకుందాం..' సాంగ్‌కు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

More News

చిరు లేకుండానే 'ఆచార్య' షూటింగ్‌..!

మెగాస్టార్‌ చిరంజీవి 152వ చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్‌ కోవిడ్‌ నేపథ్యంలో రీస్టార్ట్‌  అయ్యిందని సమాచారం.

'సైనైడ్'లో ప్రముఖ మలయాళ నటులు సిద్దిఖ్... కన్నడ నటులు రంగాయన రఘు

పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాల గ్రహీత రాజేష్ టచ్ రివర్ దర్శకత్వంలో... జాతీయ పురస్కార గ్రహీత ప్రియమణి ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'సైనైడ్'.

'సీతాయణం' టీజర్ ని లాంచ్ చేసిన మాస్ మహారాజా రవితేజ !!

కలర్ క్లౌడ్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో రూపొందుతున్న సినిమా  'సీతాయణం'.

రాజమౌళి విసిరిన ఛాలెంజ్‌కి తన స్టైల్లో రిప్లై ఇచ్చిన వర్మ

సంచలన దర్శకుడికి దాదాపు ఎవరూ సలహా ఇచ్చే సాహసం కానీ లేదంటే ఛాలెంజ్‌లు విసిరే సాహసం కానీ చేయలేరు.

ఇక నుంచి ఆన్‌లైన్ ఛానల్స్‌పై కేంద్రం నిఘా.. అశ్లీలత కట్టడికి చర్యలు..

ఓవర్‌ ది టాప్(ఓటిటి)లో పెరిగిపోతున్న అశ్లీలత కట్టడికి కేంద్రం చర్యలు చేపట్టింది. ఇక నుంచి ఆన్‌లైన్ ఛానల్స్‌పై కేంద్రం నిఘా ఉండనుంది.