'ఉప్పెన' సాంగ్ లాంఛ్ చేసిన మహేశ్
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా క్యాంప్ హీరో సాయితేజ్ సోదరుడువైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన చిత్రం‘ఉప్పెన’. ఈ సినిమాలో 'రంగులద్దుకుందాం...' అనే సాంగ్‌ను సూపర్‌స్టార్ మహేశ్ విడుదల చేశారు. హీరో, హీరోయిన్, దర్శకుడు, తన ఫేవరేట్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్‌కు ఈ సందర్భంగా మహేశ్ అభినందనలు తెలిపారు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ సినిమాను నిర్మించారు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో క్రితి శెట్టి హీరోయిన్‌గా నటించింది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.
ఈ సినిమాను ఏప్రిల్ 2న విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా ప్రభావంతో సినిమా విడుదల ఆగిపోయింది. సినిమాను ఓటీటీలో విడుదల చేస్తారంటూ వార్తలు కూడా వినపడ్డాయి. కానీ చివరకు నిర్మాతలు సినిమాను థియేటర్స్‌లోనే విడుదల చేయడానికి నిర్ణయించుకున్నారు. ఇప్పుడు థియేటర్స్ ఎలాగూ విడుదలయ్యాయి. వచ్చే ఏడాదికి సినిమాలన్నీ థియేటర్స్‌లో రావడానికి సమాయత్తమవుతున్నాయి. ఈ క్రమంలో తమ ఉప్పెన సినిమాపై హైప్ పెంచుకోవడానికి సుకుమార్ అండ్ టీమ్ కష్టపడుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన రెండు పాటలకు అద్భతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు మూడో పాటగా విడుదలైన 'రంగులద్దుకుందాం..' సాంగ్‌కు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
Launching the lovely melody #Ranguladdhukunna from #Uppena.
— Mahesh Babu (@urstrulyMahesh) November 11, 2020
Wishing my favourite Rockstar @ThisIsDSP, @aryasukku garu, debutants #PanjaVaisshnavTej, @IamKrithiShetty, @BuchiBabuSana & the entire team very best ??@MythriOfficialhttps://t.co/osLGfzWoDU
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com