సామాజిక సేవలో మహేశ్ పెద్దమనసు.. చిన్నారుల కోసం, ఆ సంస్థతో కలిసి
Send us your feedback to audioarticles@vaarta.com
సినిమాలు, షూటింగ్‌లు, ఎండార్స్‌మెంట్లు, వ్యాపార వ్యవహారాలతో క్షణం తీరిక లేకుండా వుండే సూపర్‌స్టార్ మహేశ్ బాబు సామాజిక సేవలోనూ ముందుంటారు. మహేశ్ బాబు ఫౌండేషన్ పేరుతో ఓ ఛారిటీని స్థాపించిన ఆయన.. వందల మంది చిన్నారులకు రకరకాల శస్త్ర చికిత్సలు చేయిస్తున్నారు. ముఖ్యంగా ఎంతో ఖర్చుతో కూడుకున్న హార్ట్ ఆపరేషన్స్ ఖర్చులను ఆయనే భరిస్తున్నారు. కానీ మహేశ్ ఈ విషయాన్ని చాలా గోప్యంగా వుంచారు. అయితే మహేశ్ ఫౌండేషన్ ఇటీవలి కాలంలో బాగా వెలుగులోకి వచ్చింది. దీంతో సామాజిక సేవలను మరింత విస్తరించాలని సూపర్ స్టార్ భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మరొక సంస్థతో చేతులు కలిపారు మహేశ్. రెయిన్ బో హాస్పిటల్ నిర్వహిస్తున్న ప్యూర్ లిటిల్ హార్ట్ ఫౌండేషన్ తో శనివారం మహేష్ ఫౌండేషన్ కలిసింది. ఈ మేరకు రెయిన్ బో హాస్పిటల్ ప్రతినిధులతో మహేష్ సమావేశం అయ్యారు. ఈ విషయాన్ని మీడియా ముఖంగా తెలియజేయడంతో పాటు లోగో ఆవిష్కరించారు.
ఇకపోతే.. చిన్న పిల్లలకు వైద్య సేవలు అందించడానికి కారణాన్ని మహేష్ పంచుకున్నారు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ‘ఆహా’లో బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న అన్ స్టాపబుల్ టాక్ షోలో పాల్గొన్న మహేష్ ఈ విషయాన్ని తెలిపారు. గౌతమ్ ఏడు నెలలకే పుట్టాడని.. తనని కాపాడుకోవడానికి ఖరీదైన వైద్యం అందించాల్సి వచ్చిందని సూపర్‌స్టార్ చెప్పారు. మనకు డబ్బులు ఉన్నాయి కాబట్టి కాపాడుకోగలిగామని.. మరి పేదవారి సంగతేమిటి? అనే ఆలోచన కలిగింది. నాటి నుండి గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు ఉచిత వైద్యం చేయిస్తున్నాను అని చెప్పుకొచ్చారు మహేశ్.
ఇక సినిమాల విషయానికి వస్తే.. పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాలో మహేష్ నటిస్తున్నారు. సూపర్‌స్టార్ కెరీర్‌లో 27వ సినిమాగా తెరకెక్కుతున్న సర్కార్ వారి పాటను... మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో మహేశ్ సరసన కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. సుబ్బరాజు, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మే 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout