సామాజిక సేవలో మహేశ్ పెద్దమనసు.. చిన్నారుల  కోసం, ఆ సంస్థతో కలిసి

  • IndiaGlitz, [Sunday,March 06 2022]

సినిమాలు, షూటింగ్‌లు, ఎండార్స్‌మెంట్లు, వ్యాపార వ్యవహారాలతో క్షణం తీరిక లేకుండా వుండే సూపర్‌స్టార్ మహేశ్ బాబు సామాజిక సేవలోనూ ముందుంటారు. మహేశ్ బాబు ఫౌండేషన్ పేరుతో ఓ ఛారిటీని స్థాపించిన ఆయన.. వందల మంది చిన్నారులకు రకరకాల శస్త్ర చికిత్సలు చేయిస్తున్నారు. ముఖ్యంగా ఎంతో ఖర్చుతో కూడుకున్న హార్ట్ ఆపరేషన్స్‌ ఖర్చులను ఆయనే భరిస్తున్నారు. కానీ మహేశ్ ఈ విషయాన్ని చాలా గోప్యంగా వుంచారు. అయితే మహేశ్ ఫౌండేషన్ ఇటీవలి కాలంలో బాగా వెలుగులోకి వచ్చింది. దీంతో సామాజిక సేవలను మరింత విస్తరించాలని సూపర్ స్టార్ భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో మరొక సంస్థతో చేతులు కలిపారు మహేశ్. రెయిన్‌ బో హాస్పిటల్ నిర్వహిస్తున్న ప్యూర్ లిటిల్ హార్ట్ ఫౌండేషన్ తో శనివారం మహేష్ ఫౌండేషన్ కలిసింది. ఈ మేరకు రెయిన్‌ బో హాస్పిటల్ ప్రతినిధులతో మహేష్ సమావేశం అయ్యారు. ఈ విషయాన్ని మీడియా ముఖంగా తెలియజేయడంతో పాటు లోగో ఆవిష్కరించారు.

ఇకపోతే.. చిన్న పిల్లలకు వైద్య సేవలు అందించడానికి కారణాన్ని మహేష్ పంచుకున్నారు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ‘ఆహా’లో బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న అన్ స్టాపబుల్ టాక్ షోలో పాల్గొన్న మహేష్‌ ఈ విషయాన్ని తెలిపారు. గౌతమ్ ఏడు నెలలకే పుట్టాడని.. తనని కాపాడుకోవడానికి ఖరీదైన వైద్యం అందించాల్సి వచ్చిందని సూపర్‌స్టార్ చెప్పారు. మనకు డబ్బులు ఉన్నాయి కాబట్టి కాపాడుకోగలిగామని.. మరి పేదవారి సంగతేమిటి? అనే ఆలోచన కలిగింది. నాటి నుండి గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు ఉచిత వైద్యం చేయిస్తున్నాను అని చెప్పుకొచ్చారు మహేశ్.

ఇక సినిమాల విషయానికి వస్తే.. పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాలో మహేష్ నటిస్తున్నారు. సూపర్‌స్టార్ కెరీర్‌లో 27వ సినిమాగా తెరకెక్కుతున్న సర్కార్ వారి పాటను... మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో మహేశ్ సరసన కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. సుబ్బరాజు, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మే 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More News

సండే ఫండే విత్ నాగ్ @ బిగ్ బాస్ నాన్ స్టాప్

"డిస్నీ ప్లస్ హాట్ స్టార్" లో నాన్ స్టాప్ గా సంచలనం సృష్టిస్తున్న "బిగ్ బాస్" ఎన్నో కొత్త కొత్త ఆకర్షణలతో, ఆశ్చర్యాలతో మరింత వినోదాన్ని అందిస్తోంది.

నాగశ్రీను వివాదం: మోహన్‌బాబు, మంచు విష్ణులపై మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు

విలక్షణ నటుడు మోహన్బాబు చిక్కుల్లో పడ్డారు. ఆయన తమ సామాజిక వర్గానికి క్షమాపణలు చెప్పాలంటూ నాయి బ్రాహ్మణులు రోడ్డెక్కారు.

పాముకాటుకు విద్యార్థి బలి.. జగన్ చేయూత, బాధిత కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారం

విజయనగరం జిల్లా కురుపాంలో గురుకుల హాస్టల్లో ముగ్గురు విద్యార్థులను పాము కాటేసిన ఘటనలో విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

రష్యా - ఉక్రెయిన్ యుద్ధం : కాస్త శాంతించిన పుతిన్.. తాత్కాలికంగా కాల్పుల విరమణ

ఉక్రెయిన్ స్వాధీనమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.

క్రికెట్ ప్రపంచానికి షాక్.. ఆసీస్ దిగ్గజం షేన్‌వార్న్ కన్నుమూత

క్రికెట్ ప్రపంచంలో పెను విషాదం చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.