మహేష్ - కొరటాల శివ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..!
Wednesday, December 7, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం మురుగుదాస్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. తెలుగు, తమిళ్ లో రూపొందుతున్న ఈ భారీ చిత్రాన్ని సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత మహేష్ బాబు బ్లాక్ బష్టర్ డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేయనున్నారు. డి.వి.వి దానయ్య నిర్మించే ఈ భారీ చిత్రాన్ని ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో ప్రారంభించనున్నారు. ఇక ఇద్దరు హీరోయిన్స్ నటించే ఈ మూవీలో శృతిహాసన్, కీర్తి సురేష్ లను ఎంపిక చేసినట్టు ప్రచారం జరుగుతుంది.
టైటిల్ విషయానికి వస్తే... భరత్ అనే నేను టైటిల్ ను ఈ మూవీ కోసం రిజిష్టర్ చేయించినట్టు సమాచారం. ఇక ఫిబ్రవరిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించే ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 22న రిలీజ్ చేయనున్నారని తెలిసింది. దూకుడు చిత్రాన్ని సెప్టెంబర్ 23న రిలీజ్ చేసారు. ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. దీంతో సెంటిమెంట్ ప్రకారం కూడా సెప్టెంబర్ మంత్
కలిసి రావడంతో ఈ డేట్ నే మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి...సెప్టెంబర్ సెంటిమెంట్ ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments